పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

77


వెన్నెలల నంజుకొననిచ్చి నచ్చికల బుజ్జగింపుచు కూరిమి మీఱం జేరి
నారీమణుల కొసంగి పిదపఁ గ్రోలుచు సోలుచు వ్రాలుచు చొక్కి
చొక్కి మదం బెక్కి నిక్కి మక్కువలుమీఱ నసమమదన సామ్రాజ్య
సంపదం బొంపిరి వోవునదియును పట్టయినమింటి పెనమునంజూపట్టి
చూపట్టని తొట్టినమదంబున నిందుబింబంబదటు నం జేసి పెరవారి
కదిసిన వానిబోగదిమి నిక్కుగల ముక్కులటెక్కులంజిదుమబోయి
చఱచి మేనుమఱచి యెక్కడెక్కడవోయె నేదేది యేమేమి
యనుచు ననుచుమదమ్ముటెక్కున దొక్కు తొక్కు పలుకులు
పలుకుచు నళుకుచు విందులుగా చిందులు ద్రొక్కునవియును
పొగరువగ మబ్బుననుబ్బి తబ్బిబ్బుగానాగుబ్బగబ్బిపోటు మాటలాడి
జగడించి మిన్నంటి కొన్నింటిసాకిరివెట్టి చెలువగల కలువఱేకుల
[1]బాకులు వీఁకంబూని యానికతలంకక బింకంబున నంకంబునకు
జంకించక వేట్లాడనగ్గలికడగ్గరు ననియును మవ్వంబునివ్వటిల్ల
చెందొవపూవులు కాడలతో గదియించి యకరువులు మెట్లుగాబూని,
యానూలుననానికగా తంత్రులు నిలిపి క్రొవ్వాడిమీఱుకొనగోరు
లొకయించుకమోచి నీటుగా మీటుచు బోటులురాఁగోరి వెన్నెలల
నలయించు జిలిబిలివలపులపొందుగా చిందులువ్రాయించునవియును
నగుచు నగుచు నున్నవానివినోదమ్ములు కనుఁగొనుచు నానాకలోక
కోకకుచానికరంబులు ప్రయత్నంబున.

150


క.

మునిలోక కోకవైరులఁ
గని మోహలతాళిఁద్రుంచి ఘనతరవైరా
గ్యనిరూఢినున్న వీరలఁ
జెనకన్ మఱిఁ గినుక శాపశిఖిఁద్రోతురొగిన్.

151


గీ.

ఫాలరోచనఫాల కరాళనేత్ర
కిల కీలల లీల మిక్కిలి తపోగ్ని
దనరియున్నారు వీరల ధైర్యధనము
కన్నపెట్టఁగఁ జాలఁడు వింతుఁడనుచు.

152
  1. బొంకులు. తా.