పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

ఘటికాచలమాహాత్మ్యము


చ.

కలువల[1]గోము జక్కవలగాము వియోగులబాము నల్లవే
ల్పులదరయొజ్జసానినెరమోహపు[2]దీము విభావరీసతీ
తిలకము మోము తుంటవిలుదేవునియాముగులాము మంచుర
చ్చలతెలిగీము కుందరుచిసాంద్రుఁడు చంద్రుడు దోచెఁ దూర్పునన్.

147


చ.

కువలయ విభ్రమద్భ్రమరగుంభితగేయనవాదితేయ సం
స్తవమెలయన్ చకోర ముని సంతతి సంతసిలన్ తమో సురాం
గ వితతి వే కరాశుగముఖమ్ములఁ జిమ్ముచుఁ బూర్వ శైల తా
ర్క్ష్యవిలసితాంసవీథి కమలాహితుఁ డుజ్జ్వలుఁడయ్యె నయ్యెడన్.

148


సీ.

పచ్చకప్పురపు కుప్పలు నింగి యంగడి
నించు మర్యాద రాయంచలెల్ల
గుంపుగూడినగతి గొప్ప గందంపు ల
ప్పలు విప్పులుగా నుంచుపగిది కుంద
మాలిక[3]లెత్తినమాడ్కిని మగరాలు
చల్లినకరణి వింజామరములు
వ్రేలఁగట్టినలీల పాలారబోసిన
పరువడి శంఖముల్ పఱపుజాడ
ఱెల్లుబూచినయేపున మల్లెవిరులు
వీఁక వెలిదమ్మిఱేకులజోక [4]నిండు
పండు వెన్నెల వెల్లి యఖండరుచుల
కంజజాతాండ ఖండంబు కలయఁబర్వె.

149


వ.

ఆ సమయంబునఁ జెన్నలరు కన్నెవన్నెలల వెన్నెలపులుగులలము
కొన్న చిన్నెలవన్నెల చిన్నారి పొన్నారి జిగితొగరు వగపొగరు
తొగరేకు చిప్పలొప్పారు కోరలుగా నలవరించి యించువేడుకల
కలకలారావంబుల నొండొంటిఁబిలుచుచు వలవంతల చింతల
యింతుల చెంతల రంతులు సేయుచు డాయుచు పాయుచు బంతులై
కూర్చుండి నిండుపన్నీటి యేటి కాలువల తావుల తావులం దాము
కొన్న కన్నెవెన్నెలలునించి యించు ఖండరసమ్ము మించు గుజ్జు

  1. జోము. తా. బోము. పూ. ము.
  2. గాము. తా. నోము. పూ. ము.
  3. విత్తిన మర్యాద. పూ.ము. తా.
  4. నిండ. పూ. ము. తా.