పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

ఘటికాచలమాహాత్మ్యము


వావిలిపూవు లీవావిలువకుమఱి
సేవంతి [1]నీవంతు సేసినాము
బాల నీకింద పూఁబాళ యేలమాకు
కేళి కొదవెను నీకు కంకేళిచివురు
మొల్ల లేమొల్ల మెల్లరు మెల్లరారె
యనుచుఁ బువ్వులు గోయుచు వనజముఖులు.

104


సీ.

తమ మైమెఱుంగుల గుమురు లంతంతకుఁ
దఱచైనమెఱుపుల యొఱపు నెరప
తమ ఝుళంఝుళ నూపురములరావంబులు
పటుగర్జితమ్ములభంగిఁ దనర
తమ రత్నభూషణధాళధళ్యంబులు
నీరంధ్రవృష్టిపూనిక భజింప
తమ విహారముల నాదట రాలు వేణికా
కుసుమమల్ వడగండ్లపస వహింప
వనభరణలీల వై వర్తనముగాఁగ
వనవితతి [2]ప్రోది సేయగా వచ్చి నిలిచి
నట్టి కాదంబినులనంగ నంద మొంది
మెలఁగి రప్పుడు వేడ్క నజ్జలజముఖులు.

105


క.

[3]తనురుచి లతలకు నవ్వుల
ననలకు మైవలపుసొలపునందావులకున్
బొనరిచి రతివలు నయమిడి
జగముల [4]చేపట్టి యేలు జనపతులక్రియన్.

106


క.

[5]కర మురము నెఱసి సురమద
కరి కుంభములన్ హసించు కాంతల కుచముల్

  1. లను (సరుల్ ) సేసినాము. పూ. ము . సేవంతు లీవంతు. తా.
  2. ప్రోతి. తా.
  3. తనరచిలతనకు. తా.
  4. చెప (గి) దివిడియు జనవతుల. తా.
  5. (విరిదెస) నెరసి. తా.