పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

65


విడిసినా[1]డీడ నా వెడవిల్తుఁ డనుప
మున్నుగా వచ్చి యామనివన్నెఁకాఁడు.

101


సీ.

కారాకులెడలె ముంగలికలుకళుకొత్తె
కోరిక లూరికల్గొనె చివుళ్లు
పువ్వులతావులు పొలుపొందె పిందియల్
ఫలములై ఖగతఫఃఫలములయ్యె
సేనగావలరాజు [2]సేనగోరగ సోన
లై తేనెవాన జోరనఁగఁ గురిసె
కమ్మతెమ్మెర వలిగ్రమ్మ మెల్లన వీచె
రాగంబు నించె పరాగమనుచు
ననుచు నచ్చరలేమలు ననుచు ముదము
మద మెదలనింప నింపగు మందమంద
నతుల నతులితవాక్యసంగతుల నతుల
వనము శృంగారసారజీవనము జేరి.

102


క.

తురుముల్ విచ్చి జఁడల్ కఁడు
మురువుగ ధరియించి పోఁక ముడి గట్టిగ గ
ట్టి రహిన్ జిలుగుంజేలలు
పిరిచుట్లుగఁ జుట్టి కుసుమవిహరణపరలై.

103


సీ.

నీ కేల యటు వోవ నీ కేల నందుకొ
మ్మాకొమ్మ నీకొమ్మమలయువిరులు
కేసరం[3]బులు వేనికే సరమ్మున కైన
భాసిల్లు[4]నందనప్రసవచయము
[5]చెంప చంపకమున్న చేరనేరదు తేటి
చంపకామోద యీ సరస [6]నిలుము

  1. డిదెయా. తా.
  2. సేనగోరిసేనలై . తా.
  3. బుదువనికే. తా.
  4. నందలి. తా.
  5. చంపక మున్నది (చెంప) సేరదు తేఁటి సారసామోద యీసరసనిలుము. పూ. ము.
  6. నిలుపు. తా.