పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

ఘటికాచలమాహాత్మ్యము


యడపములు మోచిమునులు నాబడిని కాణ
యాచి బంటులువోలెరా నరుగుదెంతు.

97


చ.

ఇది యొకయూడిగంబె దివిజేశ్వర! నాకు? మదీయదృష్టికిన్
మదనవిరోధియైన ధృతిమాలి చలింపక నిల్వనేర్చునే?
[1]యది యల వెన్నుఁడే యెఱుఁగు నన్న నుపేంద్రుఁడులనవ్వ నింద్రుఁడున్
ముదమున పోకలాకులును భూషణముల్ దయనిచ్చి [2]మంచిగన్.

98


గీ.

అనుపుటయు రంభ సంరంభ మడరఁ గదలి
[3]తనదు వెనువెంట వేల్పుజవ్వనులు గొలువ
దొన వెడలివచ్చు మదనమోహనవిలాస
శాతవిశిఖంబు నా నివాసంబు వెడలి.

99


సీ.

ధమ్మిల్లసురతరుస్తబకవాసనకళుల్
జుమ్మని చుట్టు [4]పేరెమ్ము గొనఁగ
నాసాగ్రమౌక్తికనవ్యచంద్రిక గ్రమ్మి
కమ్మ కెమ్మోవిపై గంతు లిడఁగ
వాలుగన్నుల డాలు వలరాజు కెంగేలి
వాలు జాడించిన లీల [5]నలర
శ్రవణభూషారత్నచకచకద్యుతులు నున్
జెక్కులచక్కి సొంపెక్కి నిక్క
కంచుకకిసల[6]గ్రంధిసంఘములు వించి
మించు గుబ్బలడా ల్మిఱుమిట్లు గొలుప
భరితరుచిరోరుయుగళసౌభాగ్యరంభ
రంభ యాగట్టుఁ జేరె సంరంభ మడర.

100


గీ.

అపుడు మేనక మొదలైన యప్సరసలు
రంభ గనుఁగొని [7]యో చిగురాకుబోఁడి

  1. మదియట. తా.
  2. మచ్చిగన్. తా. మచ్చికన్. పూ.ము.
  3. తనను. పూ. ము.
  4. వేడెంబు. తా.
  5. నడర. తా.
  6. కుంభి. తా.
  7. యా. తా. కతిచిరురాకు పూ. ము.