పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ఘటికాచలమాహాత్మ్యము


పసిడిశలాక లేఁబ్రాయపుటఱ్ఱాక
మిసమిసమించు క్రొమ్మించురేక
కళుకు రతనాల [1]తేట [2]బంగారుమూట
పలుకుచెలి చేతిచిలుక మవ్వంపుమొలక
కంతు పట్టపుదంతి సేవంతిబంతి
కలికిజక్కవచంటి యీ కలువకంటి.

89


సీ.

మెఱసి నిల్కడఁజూపు మెఱపులో నొఱపు [3]బి
త్తరములోఁదరము నిద్దాపసిండి
మిసిమిలో మిసిమి నింపెసఁగు సంపంగి పూ
తావిలోఁదావి కందర్పుచేతి
కిరుసులో బిరుసు చిత్తరువు పుత్తడివ్రాత
హరువులో మురువు సొంపలరుపువ్వు
తీవలోచేవ ముత్తియములసరము మే
ల్కళుకులో బెళుకు రాగంపుమణుల
లోను రంగునఁగూర్చి త్రైలోక్యమోహ
కలితశృంగారరసమునఁ గరువుగట్టి
మదనరాజీవగర్భుఁ డీసుదతిఁ జేసెఁ
గాక లేకున్నఁగలదె యీరేక చెలికి?

90


చ.

కలువకటారి యీచెలువ గా దల సంపఁగితూఁపు గాదు [4]మే
ల్తళుకులబిత్తరంపుఁదమి తమ్మిమెఱుంగులనేజ కాదు క్రొం
దలిరునరాజి కాదు జిగిఁదార్కొనుగేదఁగిచిక్కటారు కా
దలరులవింటివానికిఁ బ్రియంబగు మోహనబాణ మెన్నఁగన్.

91


సీ.

అమరలోక[5]మదేభగమనాభిరూప్యంబు
కులుకు నెన్నడలచే గెలుచు ననియు
ధారుణీహరిణనేత్రారూఢవిభ్రమం
బొరపుచూపులనె పోఁదరుము ననియు

  1. పేట పూ. ము.
  2. కోరికల పేట. తా.
  3. చి. పూ. ము.
  4. గా. తా.
  5. మదాభిగమనా. తా. పూ. ము.