పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

61


కలికి చన్నులు మహోత్పలకోరకత మించు
నాభి సారసమహోన్నతి వహించు
కలకంఠి కౌను పుష్కరతేజమునఁ బొల్చు
లలితాంఘ్రి వనజపల్లవతఁ దాల్చు
అహహ! శతపత్రగంధినిల్వంతయును సు
వర్ణకమలాకలాభిరూప్యంబు గాంచు
ముదితమాత్రంబె తలప నీ మోహనాంగి?
పచ్చవిలుకానిచిలుకసామ్రాణి గాక.

87


సీ.

తలఁకి భంగంబునందకపోవు టది యెట్లు
రమణి పొక్కిలిసాటి రాఁదలంచి
కడు విచ్చి గొందుల నడఁగకుండుట యెట్లు
చెలి ముంగురులరంగు చెనకఁదలఁచి
పలచనై వెలవెలబాఱకుండుట యెట్లు
పొలఁతి కెమ్మోవితోఁ బోరఁదలఁచి
లాఘవంబేది వ్రాలకపోవు టది యెట్లు
బాలచూపుల సరిపోలఁదలఁచి
సారసరసీతమస్సుధాసారవిశిఖ
వార [1]మౌ రౌర! యఖిలైకవర్ణనీయ
కలన చెలువొందు లలన యంగములతోడ
నెంచి చూచిన నెందైన నీడు [2]గలదె?

88


సీ.

కపురంపు నునుగ్రోవి కస్తూరి నెత్తావి
జిగమించు చికిలి లేఁజిగురు [3]మావి
మోహాంబునిధినావ ముత్తియమ్ముల [4]కోవ
మోహనశాంబరీమూర్తిచేవ
[5]వలపులతరితీపు నెలఱేని కళప్రాపు
వలఱేని యాఱవ కలికితూఁపు

  1. మోకౌర. తా.
  2. గలరె. తా.
  3. మోవి. పూ. ము.
  4. క్రేవ. తా. క్రోవ. పూ. ము.
  5. తలపుల. పూ. ము.