పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

ఘటికాచలమాహాత్మ్యము


లతను వలమురి మురిపెంబు నలము గళము
నలరుఁ దీవెలఁ గెలుచు చేతులును కుంద
[1]నంపు గిండ్లను గదుము పాలిండ్లు మింటి
నంటయిన లేఁతకౌను నీనాతి కలరు.

82


గీ.

యువమనో[2]మీనములఁ బట్టదివురు మరుని
చేతి నీలఁపుఁ గాలఁపుఁ [3]జివ్వ యనఁగ
జంటవాయని కఱచీమ చాలనంగ
తీరు మీఱె నయారె యీనారి యారు.

83


క.

చక్రము భ్రమ కిరవయ్యెన్
చక్రము తుత్తునుక లయ్యె శక్రవిజయ ని
[4]ర్వక్రసహాయంబగు నీ
చక్రపయోధరనితంబచక్రము [5]తొడరన్.

84


క.

చొక్కపు ముత్తెమ్ములతో
చుక్కలతో మిగుల నీడుజోడాడుచు సొం
పెక్కెడు పదాబ్జ నఖరము
లిక్కొమ్మల మిన్న చెలువ మే మనవచ్చున్.

85


గీ.

వనిత వీనులు శ్రీవైభవంబు నొంద
వాసి జిక్కి తదీయ విలాసదర్ప
ణంబులై ముద్దు చెక్కులందంబు నొందె
కానిచో నిట్టి చెల్వ మెందైనఁ గలదె?

86


సీ.

మగువ నెమ్మో మబ్జమహిమచేఁ దనరారు
కన్నులు రాజీవకలనమీఱు
[6]నాతిచూపులు కాండజాతకౌతుకమందు
కంధర జలజ విఖ్యాతిఁ జెందు

  1. ఈ పాదము తాళపత్రమున లేదు.
  2. మానముల. తా.
  3. జిల్వ. పూ. ము.
  4. ఈ పాదమునయతితప్పినది.
  5. తొడరున్. పూ. ము. తా.
  6. నారి. తా.