పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

55


పూసి హిమవారి దోగుచు వాసికెక్కు
రాజులో యన నందలి రాలు దనరు.

65


క.

చేరువ నెల జింకకు నా
హారమిడ నెలవిపూరియందించు దయో
దారత నే గిరిహరిణము
లారయఁగా బంధుభావ మట్టిదయ దా!

66


క.

మెండఁగు తాలిమి నెందే
నుండి తపం బాచరించి యుగ్రునితోడన్
భండనము చేసి వాసిగఁ
బాండవమధ్యముఁడు [1]పొందె పాశుపతంబున్.

67


వ.

ఆ శతశృంగశిఖరిరాజమ్మున రాజీవకుముదరాజివిరాజమానామంద
నిష్యంద మకరందధారా పునఃపునరేధితాంబుపూరంబును చరదురు
ద్విజవ్రజ గరుత్పటల జాతవాతోద్ధూత ప్రసూనానూన పరాగ
స్థగిత తటంబును చటులోత్తుంగ తరంగ ఘుమ ఘుమోద్భటా
రావ వ్యాప్తపరిసరంబును నిజత్రోటికాపుట విదళిత మృణాళనాళ
[2]కబళనాసక్త సంచరన్మరాళ సారసాది నానావిధ పక్షిసంకు
లంబును నగు నొక్క సరోవరంబు గాంచి తదుదంచితస్థితికి హర్షించి
యనూనస్నానపానానుష్ఠానవిధానమ్ములకు నిధానమ్మగునని యెంచి
తదీయతటాంచిత వివిక్తస్థలంబున నిలిచి నిత్యకృత్యములు దీర్చి
మౌనధ్యానమానసంబు మీఱఁ గుక్కుటాదిమయూరాంత నిగమ
నియమాసనమ్ముల నియతాత్ములై నిలిచి [3]యేకాక్షరప్రాణా
యామపరత్వంబునం జేకొన్న యింద్రియాదులం దొలంగించి
కాంచనకాచంబులందు మానసం బేకమ్ముగాఁ జేసి మమతలు
గోసి సుషమ విశోక జ్యోతిష్మతి విషయవృత్తియు ననం బ్రసిద్ధం
బైన ధారణాత్రితయంబును తమకు సర్వార్థసాధకముగా గొని
కామగతిఁ గట్టిబెట్టి నిజదాసజనతాపపాపత్రయచయమ్ముల నడుగక
[4]నడుగబడజేయు నడుగుదమ్ములును [5]మన్నుమిన్నునిండియ
నిగ్గు లగ్గలంబుగాఁ బిక్కటిల్లు చక్కని చిక్కని చొక్కపు పిక్కలును

  1. జెందె. తా.
  2. నిబళ. తా.
  3. యకౌంక్ష. తా.
  4. నడుకబడి. తా.
  5. మునుమిన్నుదిందియ. తా.