పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

ఘటికాచలమాహాత్మ్యము


నౌ ఘటికాద్రిమహాత్మ్యంబు గణుతింప
గాలేరు పరుమాణుగణము లెన్న
గలవారలైనను గావున నాయెఱిఁ
గినయంత యెఱిఁగింతు [1]వినుము వనజ
నాభుఁ జూడంగ గోరి నలినాప్తతేజులు
సప్తసంయములు ప్రశస్తమూర్తు
లాదిచాక్షుషమన్వంతరాంతమందు
నర్ణవములెల్ల నొక్కటియైనవేళ
నేకశృంగమహామత్స్యమై కడంగి
హరి వివస్వత్తనయుఁ గావఁ గరుణఁబూని.

61


గీ.

అఖిలమును మేదినీరూపమైన యోడ
[2]లోన నిండించి వాసుకి దానినంట
గట్టి యే గట్టుఱేని శృంగంపుఁ బుట్ట
బెట్టెఁబోలెడు నెర తేనెపెర తెఱఁగున.

62


గీ.

గగనగంగాతరంగసంగతములైన
శ్రీకరము లే నగేద్రంబు శిఖరసీమ
[3]క్కగమితోడ చెండాడు దిక్కు లనెడు
[4]ముదిత లొగిఁజల్లు తెలిమొల్లమొగ్గ లనఁగ.

63


క.

వరకవినుతజీవనతన్
సరసులు సరసులబెడంగునం దగు విద్యా
ధర గరుఁడోరగ కాంతలు
హరిఁ బాడుదురే నరేంద్ర మం దనిశంబున్.

64


గీ.

వెలలు మించిన మానికమ్ములు ధరించి
పునుఁగు కస్తూరి కర్పూరమును జవాది

  1. యేను వినుడు వనజ. తా.
  2. లోన వాసుకి కట్టె నేగట్టు రేని శృంగాగ్రసీమ బెట్టువోలెడు నెర. తా.
  3. రిక్కులతో విడు డాడు. తా.
  4. ముదిలోగి. తా.