పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

53


వనధికన్యక నెయ్యమున నిండు కొలువుండు
వత్స [1]సౌధమున శ్రీవత్సమలర
హారకిరీటమంజీరాంగదోదార
మణికాంతి దిశల [2]నామనిగఁ బర్వ
తార్క్ష్యుపై నెక్కి శౌరి ప్రత్యక్షమగుచు
రభసగతి [3]నేగ నిందిరారమణుమూర్తి
గానఁజాలక నిజముగాఁగందుననుచు
ఘోరతపమూన నపు డశరీరవాణి.

56


క.

ఎంత తపమాచరించిన
నింతకు మిక్కిలి శుభమ్ము లీజన్మమునన్
వింతలు డింభక విను జ
న్మాంతరమునఁ గల్గుఁ దథ్య మనియె మునీంద్రా!

57


మ.

అనిన న్మంచిది యందు కేమియని జన్మాంతంబు పర్యంతమీ
తను వేలాయని యోగసంగతిని గాత్రంబు న్విసర్జించి యా
వనజాతోదంభవనందనుంఁడనయి దివ్యన్మూర్తిఁ గైకొంటి స
జ్జనసాంగత్యమహత్త్వ మిట్టి దని యెంచంగూడునే యేరికిన్.

58


క.

అన విని భృగు వానారదుఁ
గనుఁగొని విను జనులకొంగు కనకము విద్యా
జనకము నగు పుణ్యకథన్
వినిపించితి రద్భుతంబు వింటిన్ మంటిన్.

59


క.

ఘటికాచలవృత్తము
స్ఫుటముగ భవదీయసూక్తిసుధ శ్రుతియుగళీ
పుటములు నిండఁగ జిలుకుచు
ఘటియింపు ప్రమోదరీతి కమలజసూతీ!

60


సీ.

అన విని భృగుమౌనిఁ గనుఁగొని కల్యాణ
కరణంబు హరిభక్తి కారణంబు

  1. ముప్పొంగ తా.
  2. నాగమని. తా.
  3. నేగి తా.