పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ఘటికాచలమాహాత్మ్యము


నేను తమతోడిదే లోకమై నటింప
మమత యెట్టిదొ కాని యమ్మౌనివరుఁడు
నన్ను సుదర్శనశంఖచిహ్నములఁబాత్రుఁ
జేసి మంత్రోపదేశంబు సేసి మఱియు.

51


గీ.

అచటఁ గొన్నాళ్ళు నిలిచి [1]యయ్యార్యమణికి
నన్నియునుఁ దెల్పి కౌండిన్యుఁ డరుగునంత
దైవకృతమునఁ దనతల్లి తనువుఁ దొరఁగి
చనుటయును నేను గోవిందశర్మ [2]కెరగి.

52


చ.

దళితవికార! దేవరకు దాసుఁడనౌట ఘటిల్లె నామదిం
దెలివియొకింత మీయనుమతి న్వనసీమఁ దపంబు సేయఁబో
వలయు ననుజ్ఞ యిండు భవవారిధి దాటు నుపాయ మేగతిం
గలుగదు కాన నామనవి కాదన కానతి యియ్యఁగాఁదగున్.

53


క.

అని యాతని యనుమతిఁ గై
కొని దినదినగమనమునను [3]కుధరతతులలో
ఘనమై నిలపాదప[4]తతి
ఘనమై యిలమాద్రిమీఱు ఘటికాద్రితటిన్.

54


క.

చపలతఁ బొందక శీతా
తపవర్షాబాధలకును దైన్యపడక యేఁ
దపమాచరింప హరి యా
తపమునకు న్మెచ్చి కరుణ దై వారంగన్.

55


సీ.

చపలాభమైన పచ్చని దట్టి కటిఁగట్టి
కరముల శంఖచక్రములఁ బట్టి
గరుడపచ్చలచాయగల కాయ మొప్పంగ
చలి వేడి వెలుఁగుచూపులు చెలంగ

  1. యయ్యారమణికి నెన్నియును. తా. యయ్యారుమణికి నెన్నియును పూ.ము.
  2. కరగి తా.
  3. కుధరతరులలో. తా. కుధరతరులతా. పూ. ము.
  4. తద్ఘనమై. తా.