పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

ఘటికాచలమాహాత్మ్యము


క.

జమిలి తెలిజన్నిదంబులు
సమములుగా బట్టి [1]వ్రేళ్ళసందున దువ్వున్
భ్రమసి తనపెదవి తానే
చిమచిమ మన [2]నొక్కుఁ [3]జొక్కుఁ జెలిగని మ్రొక్కున్.

33


క.

 ఇటువలె తనుజూచిన య
ప్పటనుండియు నతఁడు భావభవసాయకలం
పటమానసుఁడై [4]దిట చెడి
చిటిపటి నునువలపువలలఁ జిక్కుటకతనన్.

34


క.

చిత్తంబు కరఁగి కరుణా
యత్తమతిం తెలియ సజ్జనాచారముతోఁ
బొత్తుడిగి మరుని చివురుం
గత్తికి లోనయ్యె నయ్యగారని ప్రేమన్.

35


సీ.

నునువెండికడియముల్ మినుమినుక్కన సారె
కును దువ్వి పంకించి కొప్పువెట్టు
గబ్బిగుబ్బలు బైలుగాఁగఁ బైటచెఱంగు
జాళించి సవరించు సారెసారె
కప్పుదంతపుడాలుగార్కమ్మ తళ్కుట
ద్దము జూచి నాభి యందముగ దిద్దు
పనిలేనిపని కనుంగొను నేటవాలుగ
వాలుగన్నుల గరువమ్ము వొదల
ముద్దుముద్దుగఁ గడప్రొద్దు పొద్దు వన్నె
పుట్టములుగట్టి చిటిపొటి పూతసొమ్ము
వెట్టి మట్టెల రవళి కన్పట్ట తిరుగు
చిరుగుసిగ్గున పొరుగుభూసురుని యెదుట.

36
  1. వొళ్ళ. తా.
  2. నొక్క. తా.
  3. చెక్కు. తా.
  4. విటచెడి. తా.