పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

ఘటికాచలమాహాత్మ్యము


నతఁడు భద్రాంగి యను పేర [1]నమరు సాధ్వి
భద్రలక్షణమూర్తి నుద్వాహమయ్యె.

6


క.

ఆ లేమకు నుదయించిరి
నాళీకప్రభవనిభులు నలువురుతనయుల్
నాళీకవచను లర్చిత
నాళీకోదరులు సుజన[2]నయనాళీకుల్.

7


సీ.

ఆ కుమారులు [3]కృతాధ్యయనసంపన్నులై
తనకైన యాజ్ఞ యౌదల ధరింప
దివసాది లేచి నదీస్నాన మొనరించి
విమలదుకూలవస్త్రములు దాల్చి
యుచితాసనమ్ము [4]ననుండి లో నిండు ని
శ్చలమైననిష్ఠ నాచార్యుఁ దలచి
తిరపవిత్రంబును దిరుమణిఁ దిరుచూర్ణ
మును మేనధరియించి వినుతభక్తి
మించ సంధ్యాదివిధు లాచరించి తలఁపు
కరఁగి గీతల పఠియించి కాయమెత్తు
నతులవైష్ణవధర్మమో యనఁగ నతఁడు
వచ్చు జనులెల్లఁ బొగడ నివాసమునకు.

8


గీ.

అతని యర్ధాంగలక్ష్మి భద్రాంగి ద్వార
తోరణమ్ములు ధరియించి చేరవచ్చి
యడుగునెత్తమ్మిదోయి తీర్థాంబువులను
గడిగి తత్పాదతీర్థ ముత్కంఠఁ గ్రోలి.

9


క.

తిరుమణిపెట్టె కరమ్మున
గరమనురక్తిం ధరించి కైదండ మనో
హరుని నలరింప నభ్యం
తరమందిరమునకు నరుగఁ దనయులు భక్తిన్.

10
  1. నమర. తా.
  2. నతి. తా.
  3. శృతా. తా.
  4. ల లుండి లో నుండిక (చి). తా.