పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘటికాచలమాహాత్మ్యము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరమణిరమణపదాం
భోరుహయుగళాను[1]వేళభూషితహృదయా!
తారుణ్యవతీమనసిజ!
కారుణ్యకలాకలాప! ఖండొజిభూపా!

1


క.

అవధారు ధాతృనందనుఁ
డవిరళమధురోక్తి ననియె నాభృగుమునితో
నవదంతకుందకాంతులు
[2]సవరన చెక్కిళ్ల సాంద్రచంద్రిక లీనన్.

2


క.

హరిచక్ర మనెడు పురవర
మరిచక్రాభేద్య మగుచు హరిచక్రమొ నా
సురుచిర సుదర్శనప్రథ
కిర వగుచు రధాంగనామ హితగతిఁ దనరున్.

3


వ.

తత్పురంబునందు.

4


క.

గోవిందశర్మయనఁగా
గోవిందసమానుఁ డొక్క గోత్రాదేవుం
డావిష్కృతమేధానిధి
శ్రీవైష్ణవధర్మపారదృశ్వఁ దనర్చున్.

5


గీ.

తన సదాచార వినయ విద్యా దయాది
సద్గుణమ్ములు ప్రజలెల్ల సన్నుతింప

  1. వెలయ. తా. మేయ. పూ. ము.
  2. సవరని. తా. సవరిసి. పూ. ము.