పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

39


శా.

భూమీశా! యొకనాఁడు నీవు [1]మృగయుల్ మున్నాడ వేటాడ వి
శ్వామిత్రాశ్రమవాటి కేఁగి మృగహింసాసక్తి వర్తింపఁ[2]గా
నా మౌనీంద్రుఁడు శాపమిచ్చె నిటుగా నై తే మరేమింకిటన్
సేమం బౌనని పల్కుమాత్ర నతఁడుం జెన్నొందెఁ బూర్వాకృతిన్.

96


మ.

నరమాంసాశనవృత్తి వర్తిలెడు ఘంటాకర్ణుఁ[3]డన్ దుర్ణయుం
డరవిం[4]దాతుక్షవిపక్షతాగతమహాహంకారుఁ డాజన్మపా
పరతుం [5]డెక్కటి కృష్ణుఁగన్గొని ఖలవ్యాపారముల్ వీడ డే-?
యరుదా సాధుసమాగమంబున శుభం బౌటల్? జటిగ్రామణీ!

97


క.

విను మిన్నియు నేఁటికి మ
జనన[6]కథాకథనమేప్రశస్తోత్తరమై
యనఘా! తగునిందుల కని
వినిపించెం దత్కథానువృత్తం [7]బిటులన్.

98


ఆశ్వాసాంతము

మ.

శ్రితదేవాగమ! వాగమానితసుధాక్షీదసారోదయో
ర్జితకల్లోలనికాయ! కాయజసునాశీరాత్మభూమాధవ
స్మృతికృద్విగ్రహ! విగ్రహతృటితదాక్షిణ్యక్షణప్రేక్షణా!
శతమన్యుప్రతిమాన! మానదమహోజాగ్రగ్రహాధీశ్వరా!


క.

సదనోదరమూర్తి రమా
సదనోదరపాణిచరణసరసిజపూజా
విదితాదితముదితాత్మక!
సుదతీజనతానవీన [8]సురభిళబాణా!

  1. మృగముల్. తా.
  2. జూపా. తా.
  3. డున్. తా.
  4. దాక్షివిపేక్ష. తా.
  5. డెక్కడ. తా.
  6. జానకథనమె. తా.
  7. బటులన్. తా.
  8. బటులన్. తా.