పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ఘటికాచలమాహాత్మ్యము


తారహారముల కుద్యాపనం బొనరించి
[1]యెఱచి పోఁచలదండ లురమునిండె
అంగుళీయకముల కపజయంబు ఘటించి
జిగురుఁగండెల కేలఁ దగులు కొనియె
జాళువా పైఠాణి [2]శాలువుఁ దొలఁగించి
గదురుతోల్కటిసీమఁ [3]గదురుకొనియె
నక్కటా! యిది [4]యేమి యున్నటుల యుండి
యనుచుఁ బెనుఖేదమున సభాజనముజూడ
[5]మేటి చీకటు లీను నెమ్మని తోడ
భూతలాధీశనేత కిరాతుఁడయ్యె.

91


చ.

ఇటువలెనుండి పూర్వకృత మెట్టిదియో సదయోదయత్వ వి
స్పుటహృదయంబు వోయి పెనుబోయ[6]తనంబున బంధుకోటులన్
భటులఁ దొఱంగి ప్రాణి నిధనంబున కుద్యుతుఁడయ్యె నాతఁ డ
క్కట! జటివర్య! యెవ్వరికిఁ గాల మలంఘ్యముగా గణింపఁగన్.

92


క.

ఈలీలఁ గిరాతదశా
భీలుండై యతఁడు పురము వెలువడి క్రూర
వ్యాళీమృగపాళీఖగ
తాళీయుత మయినకోనఁ దానొకరుఁడున్.

93


క.

తిరుగుచు జంతువుల తలల్
దఱుగుచు దరుగుల్మలతలు తనకిరవులుగాఁ
బరఁగుచు నొకనాడు వశి
ష్ఠఋషి తపోవనముఁ జేరఁజనఁ గ నె మునియున్.

94


చ.

కనుఁగొని వీనిరాక కిటఁ గారణ మేమొకొ? మామకాశ్రమం
బని యిది [7]వీ డెఱుంగఁడొకొ? యౌర! భయంబరి రాఁబనేమి మా
[8]వనికి కిరాత కీట మని వచ్చిన కోపమడంచి యా తపో
ధనమణి దివ్యదృష్టి గని తద్దశ తద్దయుఁ బ్రేమనిట్లనెన్.

95
  1. యొరచి. పూ. ము. తా.
  2. శాలదూలగ జేసి. తా. శాల్వఁదూలఁగ జేసి
    పూ. ము. సాలుఁదూలఁగజేసి అనియు సవరింపవచ్చును.
  3. గుదురు. పూ. ము.
  4. యేమొ యన్న తా. పూ. ము.
  5. జడ. తా.
  6. వనంబున తా.
  7. వీడెరుంగునొకొ. తా.
  8. ఫనికి. తా.