పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

37


నానాటం దెల్లమిగాఁ
గానందగు విష్ణుభక్తికలితాత్ములకున్.

85


క.

హరిచరణాంబుజభక్తికి
గర మాకరమగుచు నేడుగాఁ నాజన్మాం
తరకృతసుకృతము కతముగ
దొరకె [1]న్నీదర్శనంబు దురితవిదూరా!

86


ఉ.

నావుడు వెండియున్ భృగువు నారదుఁ గన్గొని మౌనిచంద్ర! యిం
కా విన నెమ్మదిన్మిగులఁ గౌతుక మయ్యెడు సాధుసంగమ
శ్రీవరవైభవంబు సుధచిల్కెడుపల్కుల నానతిచ్చి న
న్పావనచిత్తుఁ జేయు మని పల్క నతం [2]డను నాతపస్వితోన్.

87


మ.

సరయూతీరమునందు నొక్కపురరాజం బుగ్రభాస్వత్ప్రభా
పరయూధప్రతిరోధకృన్మణిమయప్రాసాదహర్మ్యాంకమై
పరరాజోత్కరదుర్నిరీక్ష్యపరిఘాప్రాకారనిశ్శంకమై
మెరయున్ ధాత్రి నయోధ్యనాఁ బ్రకటమై మిత్రాన్వయాధారమై.

88


ఉ.

ఆ నగరాధినేత ధవళాంగుఁడు నాఁజను రాజశేఖరుం
డానతరాజరాజమకుటాంచితనూత్నచిరత్నరత్నభా
భానువిభానుయోగయుగపద్వికచ న్నిజపాదపద్ముఁడై
యీనిఖిలావనీధుర ధరించె నుదంచితబాహుపీఠికన్.

89


గీ.

కరము సపరికరముగ సంగరముఁ దొరఁగి
కరములు మొగిడ్చి పగతురు కరము లొసఁగి
[3]కని మని భజింప విక్రమఖని యతండు
నిండుకొలువుండి [4]యొక్కనా డుండినటుల.

90


సీ.

మాణిక్యమకుటంబు మాటి మస్తకమందుఁ
[5]బిట్ట యీఁకల నెట్ట ముట్టిపడియె

  1. ని. తా.
  2. డును. తా.
  3. రని.
  4. యొకనాడునుండునటుల. తా.
  5. బట్టియీ కేలనట్టె తా.; బట్టియీకలనట్టె పూ. ము.