పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

ఘటికాచలమాహాత్మ్యము


క.

హరికథలు వినఁగ నొల్లని
దురితాత్ముం డిందు నిరయదోషదశాకా
తరహృదయుండై యందున్
నిరవధి[1]గా ఘోరనిరయ నీరధిఁ గ్రుంకున్.

81


సీ.

శౌరిగేహమునకుఁ జనఁగఁ జాలని కాలు
కాలు కాదది మరకాలుగాని
పురుషో త్తమునిదివ్యమూర్తిఁ జూడనియక్షి
యక్షికా దల్లగవాక్షిగాని
అచ్యుతుచరితంబు లాలకింపని చెవి
చెవి కాదు రాట్నంపు చెవియగాని
నరసఖుఁ గీర్తింపఁ జొరలేని నాలుక
నాల్క కాదది కొండనాల్క గాని
దానవారాతి పూజకు రాని కరము
కరము కాదది ఘోరాఘకరముగాని
హరిపదోదకమునఁ దోఁగనట్టిరూపు
రూపు కాదది చిత్రంపురూపుగాని.

82


గీ.

కమలలోచన [2]భక్తసాంగత్య మెప్పు
డబ్బు నప్పుడె వికసించు [3]నార్యు తలఁపు
బిసరుహాప్తునిరాక నింపొసఁగ విరియు
బిసరుహంబును బోలె [4]తామసవిదూర.

83


శా.

సంగంబెన్నఁగ నెన్నిచందముల వర్షంబైనచోఁ జూడ నా
సంగంబున్ విడఁగూడ దార్యసహవాసశ్రీకరంబైన ని
స్సంగుల్ సంగమహౌషధంబగుటఁ దత్సంగంబు భక్తిప్రధా
నాంగంబై కమలామనోహరుని నత్యామోదిఁ జేయుంగడున్.

84


క.

దానముల జఁప తపో ధ
ర్మానూనాచార సూనృతాధ్యయనములన్

  1. కాగార. తా.
  2. భక్తి. పూ. ము.
  3. నార్య. తా.
  4. తామరసవిదుర. తా.