పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

ఘటికాచలమాహాత్మ్యము


నచటనె వెళుక్కు మను చోట నధివసించు
శ్రితజనావనకృతరంహు శ్రీనృసింహు
నంద [1]తిరువరసరమున నలరు నఘ వి
దారిఁ జోళహరందాభిధానశారి.

58


గీ.

వరుసఁ గారహకల్పనూర్పురమనంగ
దీనుల నిధానమయిన కార్వాన మనగ
వరలు జగదేకనిశ్చలవైభవముల
నలరు శ్రీహరిధామములందమరయ.

59


శా.

వీక్షామాత్ర ఫలప్రదంబయిన యావీక్ష్యావనా[2]ఖ్యాత పు
ణ్యక్షేత్రంబున శాలిహోత్రమునిహర్యబు రక్షింపు ప్ర
త్యక్షంబై నిటలేక్షణుండు నుతిసేయన్ వీరకోటీ రథా
ధ్యక్షుండై తగు వీరరాఘవు సమిత్కాండోల్లసల్లాఘవున్.

60


సీ.

అలకాంచిచేరువ నష్టభుజంగమ
నిలయధరాధ్యక్షు నీరజాక్షు
తిరునిన్నయూర్పుర దివ్యసౌధమ్మున
వివిధ భోగనివేశు వేంకటేశు
లీలఁ దిరుప్పక్కులీ గ్రామమున నున్న
విజయా[3]ఖ్యరామవోర్వీతలేశు
నత్తిరునిర్మలాఖ్య పురంబు నేలెడు
వైరివారణసింహు నారసింహు
తిరువదవ్వంద[4]పట్టణస్థితి వసించు
నాది భూదారమూర్తిఁ బద్మానువర్తి
నత్తిరుకడమల నున్న యమరలోక
మాన్యు నాపల్లిగొండ పెర్మాళ్లదేవు.

61


క.

ఎక్కుడు తపమునఁ దనువుల్
[5]చిక్కఁగ ఘటికాచలాఖ్యశిఖరిస్థలిపై

  1. తిర్పూర ....న. తా.
  2. ఖ్యాన. పూ. ము తా.
  3. ఖి. పూ. ము తా.
  4. వత్తనస్థితి. పూ. ము.
  5. స్రుక్కగ. తా.