పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

29


బూని తిరుక్కుడిస్థానంబునవసించు
[1]నలనరసఖ్యు నారాయణాఖ్యుఁ
తిరువారనెడు పురవరమునఁ గ్రీడించు
పాలితజిష్ణు శ్రీ బాలకృష్ణు
వినుతి సేయంగఁ [2]దిరుమందివెళ్ళనగరి
దేవపతికొల్వ నున్న శ్రీ దేవనాథు
నా తిరుక్కోవలూర్నగరాగ్రసౌధ
వీథి సర్వస్వతంత్రుఁడై వెలయు కృష్ణు.

55


క.

అలకాంచితమై తనరెడు
నల కాంచి పురిన్వరించి యధ్వరవేదీ
స్థలి వెలసి కరినగంబున
నిలిచిన శ్రీ వరదరాజు నిరుపమ తేజున్.

56


క.

ఆ కాంచికా పురమ్మున
శ్రీకర వేగవతి సుప్రసిద్ధాంబువులన్
లోకములు మెచ్చ జనులకు
వే [3]కావించిన రమేశు వేగవతీశున్.

57


సీ.

పరమేశ విణ్ణహర్ప్రాంత కాంచీస్థలి
నున్న జోళా[4]ధీశుఁ జిన్నికృష్ణు
నట దిరుప్పాడహం బనునెడ వసియించు
పార్థసారథినాముఁ బద్మనేత్రు
[5]నత్తిరుతంగస్థలావాసమునఁబొల్చు
దీపప్రభావాఖిలప్రదీపుఁ
[6]గామాక్షిబిలరతింగళ్ తుండధామధా
ముఁ దదీయినాము సంపూర్ణకాము

  1. నతలసషూఖ్యు. తా. పాదము పూర్తిగా లేదు.
  2. గరిమఁదిర్వెళ్ళినగరి. తా.
  3. కాన్పించిన: కౌన్వీంచిన. తా.
  4. ధీను. తా.
  5. నాతిరు. తా.
  6. కౌమగతిం గళ్తుండధామ. తా.