పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

19


సీ.

శరదంబు దోపరి చపల నాఁ శిరమునఁ
బటుజటాపటలమ్ము పటిమఁజూప
కల్పకశాఖి శాఖామంజరీ లీల
డాకేల మణి [1]కమండలువు మీఱ
నిటలలోచనశైలతట నీరదాకృతిఁ
గటితటి నజినమ్ము కాంతిఁ బెనుప
ఆకృతి దాల్చిన యక్షరావలి యన
శ్రవమున స్ఫటికాక్షసరము దనర
విష్ణునామానుకీర్తిఁ బవిత్రయగుచు
మారుతాహతిఁ దనుదాన మహతి మొఱయ
వచ్చె తనుకాంతినిర్జితపారదుండు
నారదుఁడు భ క్తజనసస్య నారదుండు.

16


క.

ఇటువలె వచ్చిన నారద
జటి కాతిథ్యాదివివిధసత్కృతు లెల్లన్
ఘటియించి మదిని ముదమం
దుటఁగని భృగుమౌని యతనితో నిట్లనియెన్.

17


క.

నారద [2]హృదయాంతరలీ
నారద మోక్షాతిదుర్విధావలివిద్దీ
నారద రుచిజితశారద
నారద హరిచరణభక్త నారదయాఢ్యా.

18


ఉ.

పుష్కరముఖ్యతీర్థములఁ బొల్పగుధర్మము లామహత్త్వముల్
పుష్కలవిష్ణువాసముల పూజ్యవిచిత్రచరిత్రముల్ గుణా
విష్కృతవైష్ణవోత్తమ పవిత్రవిశేషకథల్ మహాత్మ! నా
దుష్కృతముల్ దొలంగ దయతో సకలంబును నాన తియ్యవే.

19


క.

ఎచ్చోటనుండి వచ్చితి
రిచ్చటికి మదీయభాగ్య మేమని పొగడన్
వచ్చు నని పలుకునంత వి
యచ్చరముని [3]యిట్టులనియె నాతని తోడన్.

20
  1. కమండలము. తా.
  2. హృదయాతరళి. తా.
  3. యిట్లనియె. తా.