పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ఘటికాచలమాహాత్మ్యము


సీ.

మొకరితేఁటులు మూతిముట్టవు తేనియల్
శ్రీ మధుశాసి కర్పించి గాని
కోకిలమ్ములు చివురాకులు గొఱకవు
శ్రీ వనమాలి కర్పించి గాని
లేఁబచ్చికల్ గబళింపవు హరిణముల్
శ్రీ నీలమూర్తి కర్పించి గాని
ఫల భుజిక్రియలకుఁ జిలుకలు దలఁపవు
శ్రీ మాధవునకు నర్పించి గాని
యితరజంతువులును హరి మతిఁ దలంచి
గాని యే వర్తనములకుఁ బూన వనిన
నా తపోవన హాత్మ్య మభినుతింప
నలవియే వేమొగమ్ముల చిలువ కైన.

13


క.

ఆ సాధుస్తుత్యాశ్రమ
వాసమ్మున భృగుమునిప్రవరుఁడు వసించున్
శ్రీసఖచరణధ్యానా
భ్యాసకళాకాంతుఁ దాపసావళితోడన్.

14


సీ.

కటికియెండలకాఁకఁ గరఁగి గుబాళించు
గోవజవ్వాజి నెత్తావులకును
కమ్మతమ్ములతావి కానుక [1]సేయుచు
సొలయు చల్లని గాలిసోకులకును
వట్టి మ్రాకుల ననల్ పుట్టింపజాలిన
కిన్నరయువతి సంగీతములకు
బిసకాండములు మేసి కొసరుచుఁ బల్కు జ
క్కవకవ కలయిక కాన్పులకును
కలికిపలుకుల రాచిల్కగముల మధుర
మేదుర రసాలఫల రసాస్వాదములకుఁ
జెదరనీయక యింద్రియశ్రేణి నిలిపి
యతఁడు శ్రీహరి భజియించు నవసరమున.

15
  1. సేయించు. పూ.ము.