Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తమకు ముందుగా అప్పగించాల్సిందని అడిగే దుస్సాహసం చేశారు. రాజు వారి అభ్యర్థనకు దిగజారిపోక ఒకరి తర్వాత ఒకరుగా అందరినీ అదుపు చేయగలిగాడు. షితాబుఖాన్ (Shitab Khan) మరొక తిరుగుబాటు దారుడు. తన ప్రతాపాన్ని రాజమండ్రి, ఏలూరు కార్యక్షేత్ర పరిధిలో ప్రదర్శిస్తే రఫతాఖాన్ లారీ (Rafaat Khan Lari) అణచివేశాడు. అందుకు ప్రతిఫలంగా అతన్ని 'మాలిక్ నాయబ్' (Malik Naib) పదవినిచ్చి రాజమండ్రికి రవాణ చేశాడు. సహాయంగా ఆదమ్ ఖాన్ (Adam Khan), మాలిక్ షీరన్ (Malik Sheeran), తాజ్ ఖాన్ అజీజుల్ ముల్క్ (Taj khan Azeezul Mulk)లను రఫత్ ఖాన్ ఆధీనంలో పనిచేసేట్లు పంపించాడు. విజయయాత్ర ఫలప్రదంగా ముగిసింది. అధికారులు అధిగమించలేని కష్టాలున్నా ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి, తిరుగుబాటు దారులను అణచివేసి శత్రుమూకల చెరనుంచి తమ ప్రాంతాలను, జిల్లాలను తిరిగి స్వాధీన పరుచుకున్నారు. ఆ విధంగా రాజు మొక్కవోని ధైర్యం, విశ్వాసపాత్రులైన, నిజాయితీ గల అధికారుల అండదండలతో, ధైర్య సాహసాలతో ఎదురు చూడని తీవ్ర సంక్షోభాల నుండి గోల్కొండ రాజ్యం బయట పడగలిగింది.

తాళికోట మహాయుద్ధం

సుల్తాన్ కులీ కుతుబ్షా కాలం నాటి నుండి దాదాపుగా యాభై సంవత్సరాలకు పైబడి దావానలంలా చెలరేగుతున్న అంతర్ రాష్ట్రాలమధ్య యుద్ధాలకు పతాక సన్నివేశంలా తాళికోట యుద్ధానికి రంగ ప్రవేశం జరిగింది. కనుచూపు మేర కానరాని ఫలితాలకు ప్రతిరూపంగా దక్కన్ భూభాగంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఒకానొక భయానక సంఘటన. దక్షిణ ద్వీపకల్పంలో, దక్కన్కు భవిష్యత్తులో మరో రెండు వందల సంవత్సరాల వరకు దీని (చెడు) ప్రభావం, అభివృద్ధి దారులను మూసివేస్తుంది. దక్కన్ రాజ్యాల అస్తిత్వానికే పెను ముప్పు తెచ్చే విధంగా విజయనగరం సృష్టిస్తున్న పన్నాగాలు, సమస్యలే యుద్ధానికి తెర లేవడానికి ప్రధాన కారణమయ్యింది. అటు మిత్రపక్షం ఇటు విపక్ష కూటమి ఎవరైతే విజయనగరం స్నేహ హస్తాన్ని ఆశించారో, ఎవరైతే విజయనగరం స్నేహంపై నిరాసక్తతను కనబరిచారో ఈ రెండు వర్గాలు సమానంగా చెడును