Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంత్రాగాన్ని నడిపే పెద్దలకు మంచి గుణపాఠం నేర్పి జ్ఞానోదయం, రాజకీయ చైతన్యం కలిగించింది. అటు స్నేహితులు, ఇటు నమ్మకద్రోహం చేసిన వారు లేదా విపక్ష కూటమిలో వున్నవారికి, దక్కన్ రాజ్యాలకు విధ్వంసం జరిగే సూచనలు దగ్గరలోనే వున్నాయన్న సంకేతాలు అందించి ఇలాంటి విషమ సమస్యలను, విపత్కర పరిస్థితులనెలా ఎదుర్కోవాలో, భవిష్యత్తులో ఎలా నెగ్గుకు రావాలో ఆ దిశగా ప్రణాళికలను రూపొందించుకునే పరిస్థితిలోకి వారిని నెట్టివేసింది.

ఈ పరిస్థితుల పరిణామ రూపమే తాళికోట యుద్ధం. ఇలాంటి పరిస్థితులను గమనించి ముస్తఫా ఖాన్ తన రాజుకు గోల్కొండ కోటకు అవసరమైన నిర్మాణాలు చేపట్టి మరింత బలంగా, సురక్షితం చేయాలని, సైన్యాన్ని పెంచాలని సలహా ఇస్తాడు. అందుకు అనుగుణంగా అప్పటి వరకు మార్పులు, పునర్నిర్మాణాలు చేపట్టని కోటకు, కోట లోపల, బయట ప్రహరీ గోడలను మరింత పటిష్టపరచడం, కట్టుదిట్టం చేయడం జరిగింది. యుద్ధ సమయాలలో పౌరులు ప్రశాంతంగా, సురక్షితంగా వుండటానికి అనువుగా గోల్కొండ నగరానికి చుట్టూ వున్న బయటి ప్రహరీ గోడలను పూర్తిగా పునర్నిర్మించడం జరిగింది. కొత్త జీవం పోసుకున్న కోట మరో వంద సంవత్సరాలవరకు రక్షితమైన, ఎలాంటి ఢాకా లేని ప్రధాన రక్షణ కేంద్రంగా రూపు దిద్దుకుంది. రాజద్రోహం చేసి శత్రువులతో చేతులు కలిపిన వారితో కఠినంగా వ్యవహరించారు. ఇంద్రకొండ (Indra cunda) ఆధీశుడైన కేసరిరావు (Kesari Rao)ను ముస్తఫాఖాన్ శిక్షించాడు. క్లిష్ట సమయంలో ముస్తఫా ఖాన్ అందించిన సేనలకు గుర్తుగా 'మీరుమ్లా' (ఆర్థిక మంత్రి) పదవి నుంచి 'పేష్వా' పదవికి నియమించబడినాడు. రాజధానిలో వుంటూ శత్రువులతో చేతులు కలిపిన మరొక రాజద్రోహి సరోరావు (Saro Rao) - శక్తివంతుడైన నాయక్ వారి (Naik wari), తన దుష్ట పన్నాగా లతో కుతుబ్ షాహిని కూలదోసి అధికార పీఠంపై రామరాజును కూర్చోబెట్టాలనుకున్నాడు. ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసిన భయంకరమైన తిరుగుబాటుదారుల పన్నాగం. సరోరావుతో చేతులు కలిపిన తిరుగుబాటు దారుల సంఖ్య అధికం. అందరూ శక్తివంతులు. ఆ సమయంలో వారిని ఎదుర్కోవడం కష్టతరమైన విషయమే. సరోరావు అతని వర్గం లొంగిపోవాలంటే ముస్తఫా ఖాన్ ను