Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భుజాలపై వేసుకుని అవకాశం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న సమయంలో ఎదురు చూడని అదృష్టం తన తలుపు తట్టినట్లయింది. ఆశ్చర్యంగా తనకు ప్రతికూలంగా వుండే అలీ బారీద్, అలీ ఆదిల్ ఇద్దరూ తమ దృక్పథాన్ని, ఆలోచనలను మార్చుకుని, యుద్ధానికి సవాళ్ళు విసరడానికి బదులుగా శాంతి చర్చలకు ఆహ్వానం పలికారు. దీని వెనక ప్రధాన కారణం ఏమిటంటే రామరాజు వీరిని తెలుగు రాజ్యాలనుండి ఊహించని విధంగా, విపరీతంగా తీర్చలేని గొంతెమ్మ కోరికలను కోరాడు. రామరాజు కోరికలను తీర్చినట్లయితే రాజకీయ అసమానతలు పెరిగి చివరికి దక్కనుకు తిరుగులేని రారాజుగా రామరాజు లబ్ది పొందడం ఖాయమని తెలుసుకున్న వీరు తమ సిద్ధాంతాలను మార్చుకుని మిత్రపక్షం నుండి వెంటనే విరమించుకుంటారు. రామరాజుకు అతని స్థానమేమిటో చూపించడానికి సిద్ధపడతారు. ఫలితంగా ఇబ్రహీంకు జరిగిన వివరాలన్నింటిని వెంటనే తెలుపుతారు. ముస్తఫా ఖాన్ను, గోల్కొండ ప్రభుత్వం విపక్షాలవద్దకు ఒడంబడిక విధానాలను పరిష్కరించడానికి పంపుతుంది. ముస్తఫాఖాన్ చాలా తెలివిపరుడు. చతురుడు. రాజకీయ అనుభవజ్ఞుడు. నమ్మక ద్రోహం చేసిన జగదేవ్ని నిరాకరించి, తన విచార ధారను ప్రస్తావించడానికి, అభిప్రాయాలను తెలపడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన అలీ ఆదిల్తో పూర్తి నిష్కపటమైన చర్చలు జరిపారు. మనసులో ఏమి దాచుకోకుండా, స్వేచ్ఛగా తన అభిప్రాయాలు వెలిబుచ్చడంతో ఆ రోజు జరిగిన చర్చలు విజయవంతమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఒక నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చారు. కుతుబ్షాహి చరిత్రకారులు వ్యాఖ్యానాన్ని ప్రస్తావిస్తే "సత్యనిష్ట గల సయ్యద్" (Truthful Syed) వాగ్ధాటి సున్నితమైన సమస్యను పరిష్కరించడానికి చాలా వుపయోగపడిందని భావిస్తారు. పానగల్, ఘనపురం నివ్వడానికి గోల్కొండ అంగీకరించడం జరిగిందని, వీటితోని తృప్తి చెంది తన సైన్యాన్ని ఇతర ప్రాంతాలనుండి విరమింపజేయాలని రామరాజుపై ఒత్తిడి చేశారు. చివరికి ఒప్పందం కుదిరి అలీ ఆదిల్, అలీ బారీద్, రామరాజు తమ తమ సేనతో వారి వారి రాజధానులకు తిరిగి వెళ్ళిపోయారు.

అహ్మద్ నగర్ పై ముట్టడి, గోల్కొండ విధ్వంసం, దక్కన్ రాజకీయ