Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తీసుకుంటాడు. ఏనుగులు, గుర్రాలు, అపార ధన సంపద, రాజ చిహ్నాలైన విలువైన ముద్రికలను తన వెంటనే దోచుకుని తీసుకెళ్తాడు. అంతేకాదు, నిజాం షాకి రాజుల రాజసానికి గుర్తుగా నిలిచే అమూల్యమైన వస్తు సామాగ్రిని కూడా స్వంతం చేసుకుంటాడు.

కళ్యాణ్ ఓటమికన్నా ఇబ్రహీం పరాజితుడై వెనుతిరగడమే తీవ్రమైన బాధకు గురిచేసింది. మూడు వేలనిజాం షాహీలసైన్యం జత కలిసినా శత్రువుల అపార సైన్యం ముందు సరితూగలేపోయారు. అలీ, రామరాజులు గోల్కొండ దరిదాపుల వరకు తరిమి కొట్టారు. శత్రువులు, గోల్కొండకు ఎనిమిది మైళ్ళ దూరాన వున్న తాడపల్లి వరకు చొచ్చుకుని వచ్చారు. శత్రువులను నిలవరించడానికి గోల్కొండ కోట వెనుక వైపు మోహరించిన కుతుబ్షాహి సైనికాధికారులు షేర్ ఖాన్ (Sher Khan), హసనాఖాన్, అజీజాఖాన్, దౌలతాఖాన్, షేక్ మహ్మద్, మియాభాయి అందరూ పారిపోయారు. అరబ్ ఖాన్ లాంటి కొందరు శత్రుసైన్యానికి పట్టుబడ్డారు. అగ్గికి ఆజ్యం పోసినట్లు వెన్నుపోటు దారులైన ఐనులుల్క్ జగదేవ్ రావు లను కుతుబ్షాహిల జిల్లాలను నాశనం చేయండని రెచ్చగొట్టి వదిలారు. గుంటూరు (ముర్తుజానగర్ అని కూడా పేరు వుంది) రాజైన సిరితిమ్మ (Siri Timma)ను తన యాభైవేలసేనను తీసుకుని కొండపల్లి మీద దాడి చేయమని రామరాజు ముందుకు నడిపిస్తాడు. జగదేవ్ రావు తన వ్యక్తిగత చొరవతో కోయిల్కొండ, ఘనపుర, పానగల్ రాజ్యాలకు చెందిన నాయక్ - వారిస్ లను తిరుగుబాటు చేయండని ప్రేరేపిస్తాడు. ఆ విధంగా గోల్కొండ రాజ్యం నలువైపుల నుండి దిగ్బందనమై సమస్యలవలలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇందర్ కొండ, నాయక్ వారి (Naik Wari) ఐన కేసరి రావు, కుతుబ్ షాహి ఆధిపత్యాన్ని బహిరంగంగానే ధిక్కరిస్తాడు. తన తండ్రి స్థాపించిన రాజ్యం శత్రువుల, నమ్మక ద్రోహుల కారణంగా ముక్కలుగా చీల్చబడి ఒక భయానక స్థితిని ఎదుర్కోవడం చూసి ఇబ్రహీం చలించిపోతాడు. చివరకు హీనదశకు చేరుకునే దుస్థితి భవిష్యత్తులో కనబడసాగింది. కాని ఇబ్రహీం ధైర్యాన్ని కోల్పోలేదు. తన శత్రువు ఎంత బలవంతుడైనా, దుష్టుడైనా ఇబ్రహీం ఎవరికీ దాసోహం అనలేదు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా శత్రువును మట్టి కరిపించడానికి స్థిర నిశ్చయం చేసుకున్నాడు. అందుకు తగిన బాధ్యతను తన