Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దక్కన్ భూభాగంలో శాంతి, సామరస్యం నెలకొన్నదని చెప్పవచ్చు. రాజకీయ దూరదృష్టి, విశాలదృక్పథం, చతురత కలిగిన రాజనీతిజ్ఞుడు ఇబ్రహీం. విజయనగరంలో ఏడు సంవత్సరాల రాజకీయ ఆశ్రయం పొందిన కాలం అతనికి బాహ్య విషయాలు, అంతర్గత విషయాలను అవగాహన చేసుకోగలిగే అనుభవాన్ని, దృష్టికోణాన్ని విశాలం చేశాయి. రాజ్య సింహాసనాన్ని అధిష్టించిన నాటి నుంచే విదేశాంగ విధానంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, విదేశీ వ్యవహారాలను చాకచక్యంగా నడపడంతో దక్కన్ రాజుల సంఘీభావాన్ని పొందడమేగాక ప్రధానంగా దక్కన్ ప్రజల జీవనంలో శాంతి సామరస్యాలను నెలకొల్పగలిగాడు. ప్రధానంగా సాధించినదేమిటంటే తన పూర్వీకుల సైద్ధాంతీకరణలకు భంగం వాటిల్లకుండా అందరికీ ఉపయుక్తమైన కార్యాచరణతో వ్యవహరిస్తూ బీజాపూర్ నుండి ఎదురయ్యే సమస్యలకు ధీటుగా నిలబడగలిగే మార్గాలను అహ్మద్నగర్కు చూపిస్తూ తన రాజకీయ కౌశల్యాన్ని ప్రదర్శించగలిగాడు.

సమర్థుడైన తన మంత్రి ముస్తఫా ఖాన్ సహాయంతో ఇబ్రహీం కుతుబ్ షా చొరవ తీసుకుని అహ్మద్ నగర్ బలమైన మితృత్వాన్ని స్థిరపరుచుకున్నాడు. ఇబ్రహీం, హుసేన్ ఇద్దరూ గుల్బర్గా పొలిమేరలో కలుసుకుని పరస్పరంగా పలకరించుకుని వ్యక్తిగతమైన చర్చలతోనే రాజకీయ బంధాన్ని గట్టిపరుచుకున్నారు. వారి మితృత్వం రెండు రాజ్యాల, ప్రత్యేకించి అహ్మద్నగర్కు భవిష్యత్తులో అభివృద్ధికి, రక్షణకు భరోసానివ్వడమే గాక వారి ప్రజల మనోభావాలను కూడా గెలుచుకుంది. వారి మిత్రకూటమి ప్రధానోద్దేశ్యం గుల్బర్గాను వెంటనే ఆదిల్ షా ఆధీనం నుండి విడిపించి, అటుపిమ్మట విజయనగర సామ్రాజ్యపు ఆధిక్యతకు అడ్డుకట్ట వేయాలన్నది, భవిష్యత్తులో దక్కన్ రాజ్యాలకు విజయనగరం నుండి కలిగే సమస్యలనుండి విముక్తి కలిగించాలన్నది. దక్కన్ రాజుల మధ్య వున్న అసూయ ద్వేషాలు, ఒకరంటే మరొకరికి పొడ గిట్టని స్వభావమే విజయనగర సైన్యం చొరబాటుకు కారణం. ఇద్దరి మధ్య ఒప్పందం కుదరగానే గుల్బర్గా పైకి దాడి చేశారు. ఆదిల్షాకు చెందిన సైనిక రక్షణ దళం గట్టి పోటీ ఇచ్చిన శత్రు సైన్యాన్ని నిలువరించ లేకపోయింది. కేవలం విజయనగరం రాజు చొరవ వలన గుల్బర్గా