కచ్చితమైన విదేశాంగ విధానాన్ని తయారు చేసుకోక తప్పలేదు. 1543 నుండి 1550 A.D. వరకు ఈ ఏడేళ్ళ కాలంలో కొనసాగిన జమీద్ పాలన విదేశీ వ్యవహారాల నిర్వహణలో కొత్త ఒరవడిని చూసింది. జమ్ షీద్ పాలన ఆరంభ దశలోనే ఇబ్రహీం కులీకి తాత్కాలికంగా సహాయం అందించే దిశగా అకస్మాత్తుగా గోల్కొండపై అలీ బారీద్ దాడి చేయగా, గోల్కొండ విషయంలో అంతర్ రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాల సంకేతాలు పొడచూపాయి. సమయానికి అహ్మద్ నగర్ జోక్యం చేసుకోవడంతో గోల్కొండ విపత్కర పరిస్థితి నుండి తప్పించుకోగలిగింది. ఈ సంఘటన నేపధ్యంగా అప్పట్లో రాజనీతిజ్ఞుడు, రాజకీయ చతురుడుగా పేరు పొందిన షా తాహిర్ (Shah Taheer) మధ్య వర్తిత్వంతో అహ్మద్ నగర్, గోల్కొండ రాజ్యాలమధ్య మితృత్వం బలపడింది. షా తాహిర్ ప్రమేయంతో ఇరు దేశాలు ఒక సంయుక్త కూటమిగా ఏర్పడి ఎలాంటి విదేశి ఆక్రమణలు జరిగినా ఒక్కటై నిలవరించాలన్న ఒప్పందానికి వచ్చారు. అప్పటి నుండి గోల్కొండ, అహ్మద్నగర్ మిత్ర పక్షంగా వుండి ఆ రాజ్యానికి వ్యతిరేకంగా దాడులు జరిపిన బీజాపూర్, వారి మిత్ర పక్ష కూటమిని ఎదిరించి అహ్మద్ నగర్ సహాయపడింది.
పదహారవ శతాబ్దం ద్వితీయార్థంలో ఇబ్రహీం కుతుబ్ షాహి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన సమయం, సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ దక్కన్ రాజుల మధ్య గల వైషమ్యాలతో చీకటి రోజులుగా దక్కన్ చరిత్రలో నిలిచిపోయింది. సోదర రాజ్యాలైన అహ్మద్ నగర్, బీజాపూర్ కూడా శక్తివంతమైన దేశాలుగా, ఈ దేశ రాజులు హుసేన్ నిజాం షా - I (Husain Nijam Shah - I), అలీ ఆదిల్షా -I (Ali Adil Shah-I) అత్యాశ పరులై పక్క రాజ్యాలను గెలిచి ఏక ఛత్రాధిపత్యం వహించాలనే రాజ్య కాంక్షతో, అధికార దాహంతో వుండేవారు. సైనిక బలాన్ని పెంచుకుంటూ, కోటలను శక్తివంతం చేసుకుంటూ, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అహర్నిశలు శ్రమించేవారు. అలీ ఆదిల్షా గొప్ప దురహంకారి. తన కుట్రపూరితమైన పన్నాగాలతో ఎప్పుడూ శాంతిని భగ్నం చేసేవాడు. ఇటువంటి దీర్ఘ కాలికంగా సాగే అంతర్యుద్ధానికి ఆస్కారమున్న విపత్కర పరిస్థితుల్లో ఇబ్రహీం కుతుబ్షా మధ్య వర్తిత్వం నెరిపి సమాధాన పరచడం వల్లనే