గోల్కొండ రాజ్యం ఉనికిలోకి వచ్చిన ప్రారంభ కాలంలో దక్కన్ రాజ్యాలతో పరస్పర సంబంధాలను నిర్వహించుకునే విధంగా శాశ్వతమైన ఒక విదేశాంగ విధానాన్ని (Foreign policy) నిర్ణయించుకోలేదు. ముందుగా చెప్పుకోవాలంటే వాస్తవానికి కుతుబ్ షాహీల రాజ్యస్థాపన, బీజాపూర్, అహ్మద్ నగర్, బీరార్ రాజ్యాలు ఏర్పడిన చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. సుల్తాన్ కులీ విదేశీ వర్గాలతో స్నేహసంబంధాలను ఏర్పరచుకోలేక పోవడం బహమనీల పతనానికి కూడా ఇదే ప్రధాన హేతువు. సుల్తాన్ కులీ పర్షియాకు చెందిన వాడన్న విషయం మనకు తెలుసు. 1487 A.D. లో బహమనీ దర్బారులో చేరిన తదుపరి తెలుగు జిల్లాలకు పర్యవేక్షకుడిగా నియమించబడినాడు. అనగా మహమూద్ గవన్ (Mahamood Gawan) హత్య జరిగిన పదిహేను సంవత్సరాల పిమ్మట సుల్తాన్ కులీ ఆగమనం జరిగింది. గవన్, దక్కనీ వర్గీయుల స్నేహాన్ని పణంగా పెట్టి విదేశీ శక్తులకు మద్దతు అందించడానికి కారకుడయ్యాడన్న నెపంతో హత్యకు గురయ్యాడు. సుల్తాన్ మహమూద్ బహమనీ (Sultan Mahamood Bahamani) 1518 A.D. లో మరణించేంత వరకు కులీ తన స్వతంత్రతను ప్రకటించు కోలేదు. స్వతంత్రత కలిగిన రాజుగా ఎదిగినా కూడా తనకు సమకాలీనులైన ఏ రాజుతో కూడా వైరాన్ని పెంచుకోలేదు. ఆక్రమణ పేరుతో బెదిరించిన వారిని తప్పించి పొరుగు రాజ్యాలతో మంచి సహకార సంబంధాలు కలిగి వుండేవాడు. బాలమ్ కొండ (Balam cunda), కొండవీడు కోటలను దక్షిణ రాజులు తమవి అని ప్రకటించుకున్న నేపథ్యంలో విజయనగరంపై రెండుసార్లు దాడి చేయవలసి వచ్చింది. అలాగే తనకు ఆశ్రయమిచ్చి ఆదరించిన రాజు సుల్తాన్ మహమూద్ బహమనీకి వ్యతిరేకంగా, కృతఘ్నుడై, విశ్వాసఘాతకుడై మోసం చేయడానికి సిద్దపడిన ఖాసిం బరీద్ పై కూడా అతన్ని శిక్షింపడానికి రెండుసార్లు దండయాత్ర చేయవలసి వచ్చింది. ఒకసారి, బహుశా 1534లో అప్పటి విజయనగర రాజు ప్రేరణ వల్ల, ఇస్మాయిల్ ఆదిల్షా, కోయిల్కొండ కోటపై ముట్టడి చేయడానికి సిద్ధపడగా ఆదిల్షాహి రాజ్యంపై కూడా తన సేనను పంపించక తప్పలేదు. తరువాత కాలంలో రాజ్య విస్తరణ, ఆధిపత్య నేపథ్యంగా దక్కన్ రాజులమధ్య పరస్పర ఈర్ష్యా ద్వేషాలు కూడా పెరగసాగడంతో వారి స్వంత
పుట:గోల్కొండ చరిత్ర.pdf/82
స్వరూపం