Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రజలంతా సుఖసంతోషాలతో, శాంతి సామరస్యాలతో జీవనాన్ని సాగిస్తుండగా రాజ్యాన్ని ఒక సంఘటిత శక్తిగా, బలమైన శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దబడింది. ఒకవేళ ఇబ్రహీం తన పూర్వీకుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని, సింహాసనాన్ని అధిష్టించకపోయినట్లైతే గోల్కొండ భవిష్యత్తును ఊహించడం కష్టమైపోయేది. ఇబ్రహీం పాలనలో నిజాయితీకి కట్టుబడి వుండి అతనికి నమ్మకంగా వున్న వారికి జాగిర్లు, నగదు పురస్కారాలతో, బిరుదులతో సన్మానాలు చేయడమే గాకుండా పేదలకు, సామాన్య ప్రజలకు ధన సహాయం కూడా అందజేశాడు.

“ఇదిగో రాజు సాధించిన విజయ ప్రమాణాలను దర్శించండి
గెలుపు అందించిన విజయ సమాచారాలు
సూర్యచంద్రులవరకు వ్యాపించాయి.
మందస్మితయైన అదృష్టదేవత, విజయలక్ష్మి ముఖారవిందంపై
కప్పబడిన మేలి ముసుగును తొలగించింది
న్యాయం కోరినవారి చెంతకు
న్యాయదేవత స్వయంగా చేరి కరుణించింది”

పాద సూచిక:

1. ఖఫీ ద్వారా రచించబడిన 'తజ్ కెరాతుల్ ములుక్'లో ఐనుల్ ముల్క్ కోయిల్ కొండకు చేరుకుని కోటను ముట్టడిస్తాడు. కాని అతను గోల్కొండకు సంబంధించిన రహస్య పథకం పై వచ్చిన ప్రతికూలవార్తతో అప్రమత్తమై వెంటనే 'కొలాస్' ద్వారా కుతుబ్ షాహి క్షేత్ర పరిధిని దాటి తన ఐదువేల అశ్విక దళంతో సహా వదిలి వెళ్ళిపోతాడు. మరొక అభిప్రాయమేమనగా అతను (ఐనుల్ ముల్క్) కోయిల్ కొండకు రవాణాయే కాలేదని కేవలం ఇబ్రహీంకు విన్నపాన్ని మాత్రమే 'ఘనపుర' నుండి పంపించాడని తెలుస్తుంది.