Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జమ్ షీద్ పన్నాగాలను, తీవ్రమైన ఆకాంక్షను గమనించిన ఇబ్రహీం స్వీయ రక్షణగా దేవరకొండకు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇబ్రహీం తనకు నమ్మకస్తులైన అనుయాయులు- హమీద్ ఖాన్ హబ్షి (Hameed Khan Habshi), సయ్య సిలాదర్ (Syedji Silahdar), దిలావర్ ఖాన్ (Dilawar Khan) వీరితో మంతనాలు జరిపేవాడు. నమ్మకస్తులలో ఒకరైన కామాజి (Kamaji), బాహ్మణుడు. ఇతను ప్రతిక్షణం ఇబ్రహీంను కనిపెట్టుకుంటూ అతని కనుసన్నల్లో మెలిగేవాడు. తన భవిష్యత్తు నిర్ణయించిన వారిగా ఎప్పుడూ కృతజ్ఞతలు తెలిపేవాడు. వీరి సలహా మేరకు బీదర్ ఆశ్రయం పొంది భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక లేశాడు. అప్పటి బీదర్ రాజు అలీ