Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనుసన్నల్లో వుంచి బారీద్ ను తరుముకుంటూ బీదర్ వరకూ వస్తాడు. బీదర్ రాజధానిపై ఆక్రమణకు దిగడంతో బారీద్ తన పూర్తి సైనిక బలంతో ఎదురు దాడికి దిగుతాడు. రెండు రాజ్యాల సైనిక బలం పటాన్ చెరు, కోల్పగర్ (kolpagar) ప్రదేశాల మధ్య భేటీ అవుతుంది. ఇరు రాజ్యాల మధ్య యుద్ధం భయంకరంగా సాగుతుంది. యుద్ధ సమయంలో జమ్ షీద్ తాను ఎక్కిన ఏనుగును దిగడంతో సైనికదళంలో కాసేపు ఆందోళన చెలరేగుతుంది. అనుమానాలు చెలరేగుతాయి. కాని చివరికి గోల్కొండకే విజయం దక్కుతుంది.

ఓటమిల పరంపరతో వేదనకు గురైన బారీద్ లొ గోల్కొండపై పగ తీర్చుకోవాలన్న కోరిక క్రమేణా పెరగసాగింది. బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా తో వున్న పరిచయాన్ని వుపయోగించుకుని 953 A.H. (1546 A.D.) లో మెదక్ కోటపై దాడి చేసి, చరాస్తులను తన రాజ్యానికి తరలించుకున్నాడు. జం షీద్ అన్ని విధాలుగా బారీద్ ను నిరోధించే ప్రయత్నాలు చేశాడు. బీదర్ ను లక్ష్యంగా పెట్టుకున్నా, కొలాస్ (kolas) వద్ద మొదటగా దాడులు ప్రారంభించాడు. ఆస్తులన్నీ ధ్వంసం చేయసాగాడు. బారీదు మెదక్ నుండి నిష్క్రమింపచేయడానికి, ఒత్తిడి పెంచడానికి ఎన్ని విధాలుగా విధ్వంసం సృష్టించాలో అన్ని విధాలుగా జమ్ షీద్ దాడులు చేయసాగాడు. జమీన్ ను ఎదుర్కొవడానికి బారీద్ (Bareed) తన ఎనిమిది వేల సైన్యంతో బయలుదేరాడు. శత్రు వర్గాలు నారాయణ్ ఖేడ్ వద్ద కలిశారు. ప్రచ్ఛన్నయుద్ధం జరగసాగింది. ఎత్తుకు పై ఎత్తులు వేయసాగారు. మధ్యలో యుద్ధానికి ముందుగా ఐనులుల్క్ (Ainul Mulk) కుమారుడు బారీద్ సైన్యంలోని ఒక దళానికి జనరల్ గా వున్నాడు. అతను బారీద్ ను వంచించి జమ్ షీద్ తొ చేతులు కలుపుతాడు. తన ఆధీనంలో వున్న సైనిక బలగంతో పాటు జమ్ షీద్ సైన్యంలో చేరిపోతాడు. ఒకవైపు మహా యోధుడిగా పేరున్న జగదేవరావు, జమ్ షీద్ కు పట్టణ పొలిమేరలో కోటను, కోటగోడల్ని కొత్తగా నిర్మించి సైనిక స్థావరంగా ఏర్పాటు చేయాలనే సలహా ఇస్తాడు. నారాయణ ఖేడ్ యుద్ధం ప్రారంభానికి ముందే కోట భాగం నిర్మాణం పూర్తి చేసే చర్యల్ని వెంటనే ప్రారంభించి పూర్తి చేస్తాడు. స్తబ్దత నెలకొన్న సమయంలోనే జమ్ షీద్ కొలాస్ వెళ్ళి అక్కడి సైనిక బందోబస్తు వ్యవహారాలు, ఇతర యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తుంటాడు. మరోవైపు