రాజైన బుర్హాన్ నిజాం షా జోక్యం వలన ఇబ్రహీం వెనుదిరగాల్సిన పరిస్థితులేర్పడినాయి. కానీ ఇబ్రహీం భవిష్యత్తు ప్రణాళికలు వేయసాగాడు. జమ్ షీద్ బలహీనతల్ని దృష్టిలో పెట్టుకుని బీదర్ పాలకుడైన మాలిక్ బారీద్ ఏ అవకాశాన్నీ వదులుకోదల్చుకోలేదు. అవకాశం చిక్కిన ప్రతిసారీ జమ్ షీద్ ను చిక్కుల్లోకి నెట్టసాగాడు. దౌలత్ కులీ, అతని అనుచరులు కూడా అవకాశాలకై ఎదురు చూడసాగారు. ఇద్దరి పన్నాగాలు, జమీద్ పాలన వలన గోల్కొండలో ప్రశాంతత, శాంతి సామరస్యాలు దెబ్బతిన్నాయి. జమ్ షీద్ మరణం తర్వాత ఇబ్రహీం బీజాపూర్ నుండి తిరిగి వచ్చి అధికారాన్ని చేపట్టినా గోల్కొండ అభివృద్ధిలో ఎలాంటి మార్పు రాలేదు. దక్కన్ లోని చిన్న చిన్న రాజులమధ్య విభేదాలు మొదలయ్యాయి. అంతర్విబేధాలు, ద్వేషాల ఫలితంగా బహమనీ వంశ పాలనలో చీకట్లు కమ్ముకోసాగాయి. చివరికి దక్కన్ పీఠభూమి సార్వభౌమత్వం ఐదు ముక్కలుగా చీలిపోయింది. ఇబ్రహీంను తుదముట్టించి దేవరకొండ పాలనను చేజిక్కించుకోవాలన్న జమీద్ కోరిక నెరవేరకపోగా, ఇబ్రహీం, బీదర్ పాలకుడైన మాలిక్ బారీద్ సహాయంతో గోల్కొండపై దాడి చేయడం, సమయానికి జమ్ షీద్ కు అండగా బుర్హాన్ నిజామై సహాయంగా నిలవడం, ఇబ్రహీం వెనుతిరగడం చకచకా జరిగిపోయాయి. బుర్హాన్ సహకారానికి సంతసించిన జమీషీద్ అతనికి వెలలేని, విలువైన బహుమతులు ప్రధానం చేయడమే కాక స్వయంగా అతని రాజ్యానికి అతిథిగా వెళ్ళి అభినందించాడు. జమీద నన్ను 'అఫ్తాబ్రి, షా'లాంటి బిరుదులతో సన్మానించగా, జమీద్ విందును మాత్రం స్వీకరించి బిరుదులను సున్నితంగా తిరస్కరించి, సమాధానంగా ఈ చిన్న కవితను వినిపించాడు.
“గౌరవ సూచకంగా ఇచ్చే ఎలాంటి బిరుదులను నా జీవిత కాలంలో
కావాలని కోరను, నాకెలాంటి భుజకీర్తులు అబ్ఖర్లేదు
ఎలాంటి మినహాయింపులు లేవు -
దక్కన్ రాజులందరూ శత్రువును ఎదురొడ్డి
పోరాడి తమశక్తి సామర్థ్యాలతో, నైపుణ్యాలతో, ధీరత్వంతో యుద్ధరంగంలో
విజయం సాధించిన నేపథ్యం లోనే గౌరవాలను అందుకున్నారు.
కీర్తిని స్వాగతించారు.
ఎదురు నిలిచిన రాజులఎదుట నా వీరత్వాన్ని ప్రదర్శించినపుడే