'మహమ్మద్ షా లష్కరి' పాలన వరకు బహమనీల రాజ్యం శక్తివంతంగా కొనసాగింది.కాని, దురదృష్టమేమిటంటే, అరేబియా, పర్షియా, ట్రాన్స్ ఆక్సేనియా దేశాలనుండి వలస వచ్చి స్థిరపడిపోయిన విదేశీయుల తాకిడి అధికం కావడం, క్రమంగా స్థానికులపై వీరి ఆధిపత్యం పెరిగి దక్కనీలు అవమానాలకు, న్యూనతాభావానికి గురికాసాగారు. దక్కనీయులు, సంవత్సరాల తరబడి బహమనీ రాజులకు చేసిన సేవలను మరిచి, రాజ దర్బారులోను, స్థానికంగా వున్న పదవుల నుండి తొలిగించబడడం, వారికున్న అధికారాలను కోల్పోవడం జరిగింది. దాదాపుగా అన్ని ప్రభుత్వ, సైనిక రంగాలనుండి తొలగించబడిన పదవులను అఫాకి (Afaqi) లుగా పిలువబడే విదేశీయులను అప్పగించడం జరిగింది. తత్ఫలితంగా స్థానికులకు, స్థిరపడిన విదేశీయులకు మధ్య విభేదాలు పెరిగి వర్గ వైషమ్యాలకు దారి తీసింది. స్థానికులైన దక్కనీవాసులు ఆఫ్రికన్లతో జతకూడారు. ఉద్రిక్తతలు పెరిగాయి. నిర్ధాక్షిణ్యంగా విదేశీయులను చంపసాగారు. ఈ దాడులలో ప్రధానమంత్రి యైన ఖాజా మహమూద్ గవాన్ (Khaja Mahmood Gawan) కూడా చంపబడ్డాడు.
విదేశీయులను ఆదరించడం, స్థానికులను నిరాకరించడం మహమూద్ షా బహమనీ పాలనలో పతాక స్థాయికి చేరడం వలన, పక్షపాత ధోరణి సహించలేక దక్కనీయులు ఏకంగా రాజునే చంపాలని నిర్ణయించుకుని కోటపైకి దాడి చేశారు. కాని వారి ప్రయత్నం తురు, పర్షియన్లలు సమయానికి సహకరించడం వలన సఫలం కాలేదు. పరాజితులై వెనుదిరిగిన దక్కనీలను నిర్దాక్షిణ్యంగా హతమార్చండని రాజు సైనికాధికారులకు ఆజ్ఞలు జారీ చేస్తారు. మారణహోమం మూడు రోజులవరకు నిరాటంకంగా కొనసాగుతుంది. చివరికి మత పెద్దలు కలిగించుకుని రాజుని వేడుకోవవడంతో ఈ చర్య ఆగిపోతుంది.
ఈ సంఘటనలతో రాజుకు జ్ఞానోదయం కలగాలి. ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి. తుర్క్ లు, పర్షియన్లు సంక్షోభ సమయంలో సహకరించినా వారి నిజాయితీని సందేహించాల్సిందే. వారు వారి స్వార్థానికి సహకరించారే తప్ప రాజ్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోలేదనడానికి భవిష్యత్ ఘటనలే ఉదాహరణలుగా నిలుస్తాయి. స్థానిక దక్కనీయులు రాజు మీద నమ్మకం సడలి తమ వంతు సహయ సహకారాలను నిలిపివేశారు. ప్రభుత్వ కార్యాచరణలకు దూరంగా వుంటూ తీవ్రమైన నిరాశతో జీవితాలను కష్టంగా వెళ్ళదీయసాగారు. ఫలితంగా రాజ్యపాలన అస్తవ్యస్తంగా మారింది. విచిత్రమేమిటంటే ఎవరి మీదనైతే నమ్మకముంటుందో వారే, ఎవరైతే రాజుకు సహకరించారో, ఎవరి నిజాయితీని విశ్వసించడానికి సందేహం కలిగిందో వారంతా అవకాశాలను చూసుకుని