కాలం వరకు మెరుపుతోనే వుంటాయి. మచిలీపట్నం, నర్సాపూర్ దగ్గర ఈ వస్త్రాల తయారీకి కావలసిన నూలు లభ్యమయ్యేది. మచిలీపట్నం 'కలంకారి'కి ప్రసిద్ధి.
వస్త్ర పరిశ్రమతో పాటు లోహపు పనిముట్లు, పరికరాలు, ఆయుధాల తయారీ కూడా జరిగేది. కత్తులు, ఈటెలు, బల్లెంలు నిజామాబాద్ (ఇందూర్) లోని ఇందల్ వాయి దగ్గర తయారయ్యేవి. వీటికి నిర్మల్ కూడా ప్రసిద్ధి. మెరుగుపెట్టి నగిషీలతో చెక్కబడిన పెట్టెలు, గృహోపకరణాలు, దారు శిల్పాలు, చెక్క బొమ్మలు, చెక్క సామాగ్రికి కూడా గోల్కొండ ప్రముఖమైనది. కొండపల్లి, బొమ్మలకు పేరు గాంచింది. గోదావరి తీరాన వున్న నర్సాపూర్లో పడవలు, ఓడలు కూడా తయారు చేయబడేవి. ఇక్కడ హిందూ, ముస్లింలే కాకుండా పోర్చుగీసు కార్మికులు కూడా పని చేసేవారు. సముద్ర యానానికి ఉపయోగించే స్టీమర్ల నిర్మాణం కూడా జరిగేది. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటీష్ వర్తకులు కూడా 'గ్లోబ్' పేరుతో తయారు చేయబడే స్టీమర్లను కొనుగోలు చేసేవారు. 'నల్లోంచ’ ప్రాంతంలో నీలిమందు తయారు చేసి బయటి ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. 'గన్ పౌడర్' (సూరేకారపు పొడి) తుపాకిమందు, తుపాకీ గుండ్లు మచిలీపట్నంలో చేసేవారు.
గోల్కొండ రాజ్య స్థాపన దశ నుండే పశ్చిమ దేశాలు, ప్రధానంగా యూరోపియన్ దేశాలు వాణిజ్య, వర్తకపు పనులమీద రావడంతో ఇక్కడి వ్యాపార పరిశ్రమ ఎదుగుదలకు తోడ్పడింది. ఉపఖండానికి (sub continent) ఆగ్నేయ దిశలో గోల్కొండ రాజ్యం వుండటం, కోరమండల్ తీర ప్రాంతం ఆవరించి వుండటంతో నైసర్గికంగా అనుకూలంగా వుంటూ వాణిజ్యానికి, వ్యాపార కార్యకలాపాలకు అనువుగా వుండింది. 16వ శతాబ్దిలో పోర్చుగీసువారు, వారిని అనుసరిస్తూ 17వ శతాబ్దిలో బ్రిటీష్, డచ్ వారు వచ్చి వారి కంపెనీలను పులికాట్ (Pulicut), సంతమ్ (St.Thomas), మచిలీపట్నం లలో స్థాపించారు. ఈ ఓడరేవులు కుతుబ్షాహి రాజ్యం అధికారంలో వుండటంతో రాజ్యానికి, వర్తకులకు అనువుగా మారింది. మచిలీపట్నం, బందర్ రేవుగా ప్రసిద్ది పొంది అబ్దుల్లా, అబుల్ హసన్ల కాలంలో బొంబాయి రేవుకు సమాన స్థాయిని పొందింది. ఆంగ్లేయులు, డచ్ కంపెనీల కారణంగా బందర్ ఓడరేవు ప్రపంచ ఖ్యాతి పొంది ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాలలో గోల్కొండ పేరు సుపరిచితమైపోయింది. వజ్రాలు, ఖనిజాలు, వస్తు సామగ్రి ఖండాంతరాలకు ఈ ఓడ రేవులద్వారా ఎగుమతి అయ్యేవి. రాజ్యంలోని ముడిసరుకులు, విదేశీ సరుకులు ఆదాన ప్రధాన పద్ధతిలో