దాడులను ఎదుర్కోవలిసి వచ్చింది. వీరికి స్థానిక దక్కనీల మద్దతు లభించింది. ఇంకను షా రాజు -
1, బీదర్ కు చెందిన షా ముహిబుల్లా లాంటి మత పెద్దల సహకారం అందింది. ఈ తిరుగుబాటు దాడులు రాజకీయంగా, జాతి వివక్షకు వ్యతిరేకంగా రూపు దాల్చి సంఘర్షణగా పరివర్తన చెందింది. వారు స్థానికులు, విదేశీయుల మధ్య జాతి వివక్షను చూపుతూ ఇరు వర్గాల మధ్య శత్రుత్వం పెంచారు. ఐనా, రాజు ఈ తిరుగుబాటును చాలా వరకు అణిచివేసినా, సోదరులిద్దరూ రాజ్యంలోని ప్రశాంత వాతావరణాన్ని విషపూరితం చేయడంలో కృతకృత్యులయ్యారు.
ఈ సంఘటనలు ముస్లింల మధ్య ఒక విషాదకరమైన విభజన రేఖను సృష్టించింది. కాని కాలక్రమంగా రాజకీయ అనిశ్చితి తొలగి సాధారణ పరిస్థితులేర్పడినాయి. తరువాత వచ్చిన సుల్తాన్ మహమ్మద్, అబ్దుల్లా, అబుల్ హసన్ల పాలనలో కూడా సాధారణ స్థితులు కొనసాగాయి. ఈ పాలకులు తమ పూర్వీకుల మాదిరి మత స్వేచ్ఛా సిద్ధాంతాలను గౌరవించి, దీర్ఘకాల ప్రణాళికలను పునరుద్దరించి అందరిలో సమదృష్టి భావనను నెలకొల్పారు.
పాద సూచిక:
1. భద్రాచల దేవాలయ నిర్మాణం, గోపన్న రామదాసు ద్వారా నిర్మించబడినది. దేవాలయ నిర్మాణం, గోల్కొండలో రామదాసు కారాగారవాసం, దీని వెనుక వున్న కథ జగత్ప్రసిద్ధి. ఈ దేవాలయ నిర్వహణకు తానాషా (అబుల్షాసన్), భద్రాచలం, పాల్వంచ, శంకరగిరి పట్టి, ఈ మూడు గ్రామాలను దేవాలయ మాన్యాలుగా ఇచ్చివేశాడు. అలాగే భ్రమర మల్లేశ్వర స్వామి దేవాలయానికి భోగవరం, చెరుకూరు, వీరన్నపట్నం అను మూడు గ్రామాలను దేవాలయ నిర్వహణకు దానం ఇచ్చాడు. దీనికి సంబంధించి తానాషా 12 Rabi - I, 1095 A.H. 'ఫర్మానా'లో వుంది.