తెలుస్తుంది. (గుంటూరును అప్పుడు అధికారికంగా ముర్తుజానగర్ అని పిలిచేవారు). అబ్దుల్లా, అబుల్ హసన్ తమ స్వీయ ఖర్చుతో ప్రత్యేక రక్షణ దళాలను కూడా నిర్వహించే వారని చరిత్రకారులు తెలుపుతారు. అబుల్ హసన్ 40, 000తో కూడిన సేనను, అదేవిధంగా మాదన్న 10,000 గలఅశ్విక దళాన్ని స్వయంగా నిర్వహించేవారని తెలుస్తుంది. ప్రధాన సైనిక బలగాలే కాకుండా కుతుబ్షాహీలకు 'ఖాస ఖయిల్' (khasa khail) అనే ప్రత్యేక అంగరక్షక దళం వుండేది. అధికారికంగా ఇందులో ఆరు వేల మంది సైనికులు వుండేవారని చెబుతారు. కాని మరికొందరు 40,000 సైనికులతో బలమైన దళంగా వ్యవహరించేదని వ్యాఖ్యానిస్తారు. 'తారీఖ్-ఎ-జాఫ్రా' (Tarikh-e-zafra) ప్రకారం చివరి రాజు కాలంలో 55,000 అశ్విక దళం, 96,000 కాల్బలం, అదనంగా లక్ష మంది సైనికులతో 'యూరోపియన్ గార్డ్' వుండేది. 'కర్నాటక ప్రావిన్స్ 'కు రేవుకు, యూరోపియన్ సెటిల్మెంట్కు దగ్గరగా వున్న కారణంచే మీర్ జుమ్లా, నేక్ నామ్ ఖాన్ ల ఆధ్వర్యంలో 40,000 సేనను కేటాయించారని కొన్ని రికార్డులు తెలుపుతున్నాయి. నేఖ్ నామ్ ఖాన్ కు అదనంగా 5000 అశ్విక బలాన్ని కూడా కేటాయించినట్లు తెలుస్తుంది. మొఘలుల నుంచి ప్రమాదం వున్న వ్యూహాత్మక ప్రాంతమైన ఉత్తర ప్రావిన్స్కు కూడా అధిక సంఖ్య గలసేనను సమకూర్చి వుండవచ్చు.
కుతుబ్ షాహి చరిత్ర ద్వారా స్పష్టంగా అవగతమవుతున్న విషయమేమనగా, భూస్వాములు, కమతపు దారులు /ఇనాము దారులు చేసే అవత తవక పనులవల్ల రక్షణ వ్యవస్థ దెబ్బ తినే అవకాశాలు వున్నాయి. అందుకే అబ్దుల్లా కుతుబ్ షా, మంచి విగ్రహం, దృఢకాయులు, ధైర్యవంతులుగా వున్నవారినే జాగిర్దార్లుగా ఎన్నుకునేవాడు. అలా అలీఖాన్ బేగ్ అఫ్సర్ (Ali Khan Baig Afshar), మహమ్మద్ సయీద్ బేగ్ బదక్షాని (Mohd Said Baig Badakhashani), సయ్యద్ బాబు, మఖం ముల్క్ దఖాని లాంటి వారిని కమతపు దారులు, జాగిర్దార్లుగా నియమించి కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేయమని కోరారు. వీరి ఆధ్వర్యంలో కొత్త ఆయుధాలతో, ఆయుధ సామాగ్రితో ఫ్యూడల్ సేన శక్తివంతంగా తయారై ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడు సిద్దంగా వుండేది.
కుతుబ్ షాహి సేనలో ముస్లింలు, హిందువులు వుండేవారు. ముస్లింలలో దక్కనీలు, పర్షియన్లు, తుర్క్ లు వుండేవారు. దక్కనీల మూలాలు వాస్తవానికి పూర్వ తుర్క్ లతో కలిగి వుండి దక్కన్ లొ స్థిరపడి 'సెంటూరియన్స్' (Centurians) గా పిలువడేవారు. ఈ సెంటూరియన్స్ ఖల్జి (Khalji) రాజుల దగ్గర సైనికులుగా