Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతను వదిలి వెళ్ళాక, చక్రవర్తి ఔరంగజేబు ఆలంఘీర్ ఆక్రమించారు” గోల్కొండపై గెలుపుకు సంబంధించి విధి విధానాలు పూర్తయ్యాక చక్రవర్తి హైదరాబాద్ నగరానికి విచ్చేసి రెండు మాసాలకు పైగా మజిలీ చేశాడు. సాంప్రదాయాన్ని నమ్మితే, చక్రవర్తికి సంబంధించిన శిబిరం చార్మినార్ కు తూర్పు భాగంలో ఓ చోట ఎక్కడైతే కుతుబ్ షాహీల స్నానాలగది వుండేదో అక్కడ వేశారు. చక్రవర్తికి నగర వాతావరణం ఆహ్లాదం కలిగించడంతో మూడు నెలలకు పైగానే మకాం వేశాడు. అతను మజిలీ చేసిన కాలంలో రాజ ప్రాసాదాలను, వాటి పరిసరాలను సందర్శించాడు. రాజ ప్రాసాదాల వైభవానికి ఆకర్షితుడై కుతుబ్ షాహిల ఆడంబర జీవితానికి, సంస్కృతికి ముగ్ధుడైనా, ఎక్కడ కూడా ఆ ఛాయలు కనిపించకుండా, వారిని పొగడ్తల రూపంలో వ్యాఖ్యానించకుండా జాగ్రత్తపడినాడు. దానికి బదులుగా అవకాశం చిక్కిన ప్రతిసారీ కుతుబ్ షాహీల రాజరికపు గౌరవానికి, ప్రతిష్టకు భంగం కలిగే విధంగా రంధ్రాన్వేషణ చేయడం, గొప్పదనాన్ని కొట్టివేయడం, కువిమర్శలు చేయ సాగాడు. అయినప్పటికీ మహమ్మద్ సకీ, దర్బారు చరిత్రకారుడు, చక్రవర్తి ఆలోచనలతో విభేదిస్తూ హైదరాబాద్ నగర సంస్కృతి, రాజప్రాసాదాల శిల్పకళా వైభవానికి గాఢంగా ఆకర్షితుడై అభినందిస్తాడు. మరాఠాల నుండి ఎదురవుతున్న సమస్యల నెదుర్కోవడానికి Ist of Rabi - II, 1098 A.H (1687 A.D.)న హైదరాబాద్ ను వదలలేక అసంతృప్తితో, నిర్లక్ష్యంగానే బీజాపూర్ కు బయలుదేరుతాడు. వెళ్ళడానికి ముందు తాత్కాలిక చర్యగా రుహుల్లా ఖాన్ కు హైదరాబాద్ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలనప్పగించి వెళతాడు. కాని కొన్ని రోజుల తరువాత అతని స్థానాన్ని జన్ సిపార్ ఖాన్గా పిలువబడే బహదూర్ దిల్ ఖాన్ తో భర్తీ చేస్తాడు. చక్రవర్తితో పాటు, ఉత్తరాదికి తరలి వెళ్ళాల్సిన అబుల్ హసన్ తనకు సరియైన, హోదాకు తగిన నివాసాన్ని సమకూర్చవలసిందిగా కోరతాడు. సకీ ప్రకారం, హసన్ ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలను, అలసటను భరించలేని స్థితిలో వుండి తన ప్రతిష్టను, గౌరవానికి తగినట్లుగా విన్నవించుకున్నాడని భావిస్తాడు. అతని కోరిక ప్రకారం జన్ సిఫార్ ఖాన్ ను తోడుగా ఇచ్చి అబుల్ హసను దౌలతాబాద్కు పంపివేస్తాడు. జన్ సిపార్భన్, సాయుధ బలగాలతో హసన్కు రక్షణగా వుంటూ దౌలతాబాద్ కోట వరకు మార్గదర్శనం చేసి అతనికి కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చి, దౌలతాబాద్ కోటలో నిర్బంధంలో వుంచుతాడు. మిగిలిన శేషజీవితాన్ని హసన్ అక్కడే గడుపుతాడు. ఖఫీ ఖాన్ వివరణ ప్రకారం సంబంధిత అధికారులకు, హసన్కు