అంకితమైనవాడు 'ఆలంఘీర్ పాదుషా' సేవలు అంగీకరించలేడు" అంటూ జవాబిచ్చాడు. ఈ జవాబుతో చక్రవర్తి అసంతృప్తికి గురైనా, రెండవ అవకాశం కోసం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటం కోసం ఆశించాడు. రజ్జాక్ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిన తరువాత చక్రవర్తి తన ప్రస్తావనను మరోమారు తెలియపర్చినా రజ్జాక్ ప్రతిచర్యలో ఎలాంటి మార్పూ లేదు. అంతేకాదు, హజ్ యాత్రకై 'హిజాజ్' వెళ్ళాలనే కోరికనూ వెలిబుచ్చాడు. అతని తిరస్కారంతో, కోపానికి గురై అతన్ని నిర్బంధించి తన సమక్షంలో హాజరు పర్చాలని ఆదేశించాడు. ఫిరోజంగ్ పరిస్థితి తీవ్రతను గమనించి ఆందోళన చెంది, ఇద్దరి మధ్య సయోధ్యను కుదిర్చే ప్రయత్నం చేశాడు. ఫిరోజ్ మధ్యవర్తిగా రజ్జాక్ను పరామర్శించి, మారిన పరిస్థితులదృష్ట్యా తన పాత ఆలోచనలు పట్టుకుని వేల్లాడ్డం ఉచితం కాదని వివరించాడు. "పాత సిద్ధాంతాలు ఎంత గొప్పవైనా వాటిని అంటిపెట్టుకోవడం వలన లాభం లేదని” హితవు చెప్పాడు. ప్రత్యేకించి పరిస్థితులు తారుమారైనప్పుడు, రాజ్యమే లేనప్పుడు సరికాదు. తరువాత అతను చక్రవర్తికి సిఫారసు చేసి ఔదార్యంతో రజాక్ స్థితిని పరిశీలించవలసిందిగా కోరాడు. కాని రజ్జాక్ లాడి మాత్రం ప్రస్తావనను అంగీకరించే స్థితిలో లేడు. కాని పరిస్థితి తీవ్రతను పక్కకు తప్పించే దిశగా ఒక ఏడాదికాలం వేచి చూసి ఒప్పుకోక తప్పింది కాదు. రజ్జాక్ కోసం నాలుగు వేలశ్రేణితో, మూడు వేల అశ్విక బలాన్ని ప్రత్యేకించబడింది. అదనంగా 'ఖాన్' టైటిల్ తో ఏనుగులు, గుర్రాలు ఇవ్వడం జరిగాయి. అర్ధమనస్కుడై మొఘల్ ప్రభుత్వానికి కేవలం రెండు సంవత్సరాలు సేవలందించి తరువాత సెలవు కోరి పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. అతని నలుగురు కుమారులు: అబ్దుల్ ఖాదిర్, అబ్దుల్ కరీం, రజ్జాక్ అలీ, ఖలీల్ మహమ్మద్, వీరు వివిధ హోదాల్లో వుంటూ జాగీర్దార్లై ఔరంగాబాద్లో వుండిపోయారు.
మొఘల్స్ కోటలోపలికి 24 జికాద, 1098 A.H.న ప్రవేశించిన వారికి, విజయానికి సంబంధించిన వ్యవహారాలను, విధి విధానాలను పూర్తి చేయడానికి వారానికి పైగా సమయం పట్టింది. ఈ చరిత్రాత్మక సంఘటనను స్మారక చిహ్నంగా గుర్తు పెట్టుకోవడానికి అనుకూలంగా రాయబడిన కాలపట్టిక లో ఈ తేదీ లిఖించబడింది. 'ముల్తఫిత్ ఖాన్' టైటిల్ తో పిలువబడే అబుల్ ఖాసిం రచన 'గోల్కొండ విజయోత్సవ అభినందనలు' (congratulations for the conquest of Golcunda) లో, నిమత్ ఖాన్ అలీ పద్యంలో 1098 A. H లో పేర్కొనబడింది.
- “విధి ఆదేశానుసారం అబుల్ హసన్ తన నివాసమైన
- చార్ మహల్ ను వదిలి వెళ్ళారు