పాత్రలు, పరికరాలతో పాటు ఆభరణాలు, ఆరు కోట్ల ఎనభై లక్షల పదివేల రూపాయలను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఈ ఆస్తులన్నీ రాజకోశాగారానికి బదిలీ చేశారు. కుతుబ్ షాహి పాలనలో వున్న అనేక మంది ఉద్యోగులను, వృత్తి నిపుణులను, కిందిస్థాయి హోదాలో వున్నవారందరినీ వారి వారి స్థాయి, శక్తిసామర్థ్యాలకనుగుణంగా జీత భత్యాలతో మొఘల్ ప్రభుత్వంలో భర్తీ చేసుకున్నారు. రాజ్యం కోల్పోయిన రాజు సంతానానికి, రాజ కుటుంబాలకు తగిన విధంగా వారి కనుకూలమైన అవకాశాలు ప్రసాదించారు. మగవారికి 'మన్సబ్' (Mansabs) లు ప్రదానం చేశారు. రాజు కుమార్తెలకు వారికి తగిన వరులను ఇచ్చి వివాహం జరిపించారు. రాజు దత్తపుత్రుడైన అబ్దుల్లాను నాలుగు వేల శ్రేణికి, నాలుగు వేల అశ్విక దళానికి అధిపతిని చేశారు. గోల్కొండ పతనానికి ముందే పెళ్ళి కెదిగి వున్న ముగ్గురు కుమార్తెలలో పెద్ద కూతురును రాజ్య భ్రష్టుడైన బీజాపూర్ రాజు సికందర్ ఆదిల్షాతో, రెండవ కూతురును షేక్ మహమ్మద్ సుహార్ వర్ది కొడుకైన మొఘల్ 'పీర్' మహమ్మద్ ఒమర్‌తో, ఇక మూడవ కుమార్తెను ప్రధానమంత్రి అసద్ ఖాన్ కుమారుడు ఇనాయత్ ఖాన్ కిచ్చి వివాహం జరిపించారు. అబ్దుర్ రజ్జాక్ లాడి, తన యజమాని పట్ల చూపిన భక్తి విశ్వాసాలకు ముగ్ధుడైన చక్రవర్తి స్వయంగా శ్రద్ధ తీసుకుని భారతీయ, యూరోపియన్ వైద్యులను ప్రత్యేకంగా నియమించి అతని గాయాలకు చికిత్సకై ఆదేశించాడు. "లాడి లాంటి విశ్వాస పాత్రులు మరికొందరు వుంటే కోట ముట్టడిపై విజయానికి మరికొంత దీర్ఘకాలం పట్టేది" అని చక్రవర్తి స్వయంగా అంగీకరించాడు. రజ్జాకు పరీక్షించిన వైద్యులు చక్రవర్తికి అందించిన రిపోర్టులలో, అతని శరీరంపై లెక్కకు మించి గాట్లు వున్నాయని, కేవలం ముఖం మీదనే డెబ్బై కత్తి గాట్లు వున్నాయని తెలిపారు. ఒక కన్ను మీద గాయం లేకున్ననూ, రెండు కళ్ళలో దృష్టి కోల్పోయే అవకాశం వున్నదని సూచించారు. పదమూడు రోజులతరువాత రజ్జాక్ నెమ్మదిగా కళ్ళు తెరిచి గొణగసాగాడు. అతను కాస్త కోలుకున్న విషయం తెలుసుకున్న చక్రవర్తి గతంలో జరిగిన పొరబాట్లు, తప్పులన్నింటినీ క్షమించి రాచరికపు మర్యాదలు, హోదాలు మీకనుకూలంగా అందజేయగలమని సందేశం పంపిస్తాడు. కాని అబ్దుర్ రజాక్ మొఘలులు ఇచ్చే గౌరవ మర్యాదలను, మొఘలులకు సేవ చేయడానికి తిరస్కరిస్తూ: "నాది ఒక మొండి బతుకు, అయిననూ నేనింకా పూర్తిగా కోలుకోలేదు. కోలుకుంటానన్న నమ్మకమూ తక్కువే. ఒకవేళ నేను జీవించి యున్నా గాయాలతో, అంగవైకల్యంతో అధికారిక బాధ్యతలు చేపట్టి కార్యనిర్వహణ చేయడం సాధ్యం కాని పని. దానికి తోడు ఏ వ్యక్తీ అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ అబుల్ హసన్ కే
పుట:గోల్కొండ చరిత్ర.pdf/261
స్వరూపం