Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సైనికులను కోల్పోయింది. షా ఆలమ్ తిరిగి రెండవ ప్రయత్నంగా ఇరుపక్షాల మధ్య శాంతి ప్రస్తావనను తీసుకువచ్చాడు. కాని అబుల్ హసన్తో అతని ఉత్తర, ప్రత్యుత్తరాలు చక్రవర్తి ఆగ్రహానికి గురయ్యాయి. మొదటి నుంచే ప్రిన్స్ విశ్వసనీయతపై అనుమానం వున్న చక్రవర్తి ప్రిన్స్న, అతని భార్యను నిర్బంధంలోకి తీసుకున్నాడు. యుద్ధం బాధ్యత ఫిరోజజంగ్ భుజాలపై పడింది. అతనికి సహాయంగా మీర్ అలష్, సఫ్ షికన్ ఖాన్, రుహుల్లా ఖాన్ బక్షీ నిలిచారు. 16 మే (14th Rajab) రోజున ఫిరోజ్ జంగ్ రాత్రిపూట దాడి చేయాలనే పథకం వేశాడు. ఈ పథకం ప్రకారం కోట గోడలపై తాళ్ళ నిచ్చెనలసహాయతో పాకి కోటలోపలికి ప్రవేశించాలి. కాని ఈ పథకం విఫలమవుతుంది. ఈ సమయంలో గోల్కొండ రక్షణ దళం గాఢనిద్రలో వుంటుంది. కాని అక్కడే వున్న కాపలా కుక్క అరుపులతో అప్రమత్తులైన సైనికులు వెంటనే కార్యోన్ముఖులై మొఘల్ సేన కోటపైకి రాకుండా వారి తాళ్ళను కత్తిరించడం, నిచ్చెనలను పడదోయడం చేసి వారి ప్రయత్నాలు విఫలమయ్యేట్లు చేస్తారు. తుపాకులు పేల్చి తీవ్రనష్టం కలిగించారు. ఈ విజయంతో మరింత ఉత్సాహం, స్ఫూర్తి పొందిన గోల్కొండ సేన, మొఘల్ ఫిరంగి దళంపై దాడి చేసి అనేక ఫిరంగి సైనికులను హతమార్చారు. కుక్క తన అరుపులతో రక్షణ దళాన్ని అప్రమత్తం చేయడం వలన ఈ విజయాన్ని కుక్కకు ఆపాదించి దానికి 'ఫిరోజ్ జంగ్' బిరుదుతో సత్కరించి బంగారు గొలుసును దాని మెడకు అలంకరించారు.

ముట్టడి కొనసాగుతూ, సాగదీయబడటంతో కాలయాపన జరిగి మొఘలులు తీవ్ర విషమ పరిస్థితుల నెదుర్కొనవలసి వచ్చింది. వర్షాలు/ రుతువులు సరిగా రాకపోవడంతో రాజ్యంలో కరువు ఏర్పడటం, దానికి తోడు గోల్కొండ మిత్రపక్షమైన శంభాజి నాయకత్వంలోని మరాఠా దాడులు, ఆహార ధాన్యాలసరఫరాకు తీవ్ర అంతరాయం కలిగించసాగింది. రెండేళ్ళ కరువుకాలం తరువాత జూన్ నెలలో వర్ష రుతువులో కుంభవృష్టి వర్షాల కారణంగా సమాచార యంత్రాంగానికి అంతరాయం కలిగి కొత్తగా మొఘల్ సేనకు మరింత తలనొప్పిగా మారింది. విపరీతమైనవర్షాల కారణంగా ఆహార ధాన్యాలసరఫరాకు అంతరాయం కలగడమే గాక, ఫిరంగి దళానికి అవసరమైన బారికేడ్లు, వేదికలు నాశనమై ఆక్రమణదారులకు అసౌకర్యం కలిగించింది. ఈ తాజా పరిణామాలతో వారిలో కలిగిన నిరాశను ఆసరా చేసుకుని తక్షణ చర్యగా గోల్కొండ రక్షణ దళం, మొఘలులఆర్టిలరీ (ఫిరంగి దళం) పై దాడి చేసింది. తుపాకీ బ్యారెల్లో మేకులు జొప్పిచి, పెద్ద ఎత్తున గన్ పౌడర్ ను ఎత్తుకుపోవడం, కొందరు మొఘల్ అధికారులు : జమీషీద్ ఖాన్, సలీం ఖాన్, సఫ్