Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బహుశా ఇదే వుద్దేశం అయి వుండవచ్చు. ఎవరైతే గోల్కొండతో నమ్మక ద్రోహం తలబెట్టడానికి సాహసం చేస్తారో వారికి పట్టే గతి ఇలా వుంటుందని ఓ దిక్కు మాలిన నమ్మకంతో పంపి వుంటారన్న అభిప్రాయం వుండవచ్చు. కాని ఇదంతా వృధాయే. మొఘలులు, బీజాపూర్ పై విజయం సాధించే వరకు స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి, కొంత సమయం కోసం ఒప్పందం, కేవలం తాత్కాలిక చర్యగా వాడుకున్నారు. సృష్టించబడిన పరిస్థితులను దుర్వినియోగపరచి, సామ్రాజ్యం పన్నిన పథకాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రవర్తించరాదన్న రీతిలో షా ఆలం ను, బహదూర్ ఖాన్ ను రహస్యంగా చీవాట్లు పెట్టారు. అందుకే ఒప్పందంలోని షరతుల నిర్వహణ పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సాదతాఖాన్ ను 'హజిబ్'గా (Resident Officer) గోల్కొండకు పంపించారు. హజిబన్ను అనుసరించి అతని సోదరుడు నిమతాఖాన్ (Nimat Khan)గా పిలువబడే మీర్జా మహమ్మద్ (Mirza Mohd) శాంతి స్థాపన పేరుతో వెళ్తాడు. కాని అతని ప్రధాన రాజకీయ లక్ష్యం, చర్చల సమయంలో అబుల్ హసన్ ను రెచ్చగొట్టి కోపావేశాలకు గురిచేసి యుద్ధానికి ప్రేరేపించడం. ఖఫీఖాన్ మాటల్లో “దురదృష్ట వశాత్తు అబుల్ హసన్, మొఘల్ రాయబారి కన్నా చతురతతో, సంభాషణా చాతుర్యంలో తక్కువేమీ కాడు. అందుకే తన ప్రత్యర్థిని ప్రతి విషయంలో, వివాదంలో ఒప్పించి నోరు మూయించగలిగాడు" అంటాడు.

28 జనవరి 1686 A.D. (1097 A.H.), 24 రబి-1, న ఔరంగజేబు గోల్కొండ దగ్గర ఒక ప్రాంతానికి చేరుకున్నప్పుడు అబుల్ హసన్ కుతుబ్షా వినమ్రమైన మాటలతో శాంతి ప్రస్తావన తీసుకుని విన్నవించుకోగా, చక్రవర్తి అతన్ని అసహ్యించుకుంటూ దుర్మార్గుడిగా అభివర్ణిస్తూ, ఎలాంటి దుష్టకార్యానికైనా తెగించేవాడని హసన్ విన్నపాన్ని బేఖాతరు చేస్తాడు. సమర్పించిన వినతి పత్రాన్ని వెంటనే తిరస్కరించి 'ఫర్మాన్' ను జారీ చేస్తాడు. ప్రజల్లో అబుల్ హసన్ పట్ల వ్యతిరేక భావన కలిగే విధంగా, ముస్లిం ప్రజల్లో అతని నిబద్దత మీద సందేహాలు రేకెత్తించే విధంగా హసన్ ను ప్రస్తావిస్తూ అతను రాజు కాగల స్థాయికి తగినవాడు కాదని, ఈ స్థాయికి రావడం ఒక దురదృష్టమని అభివర్ణించాడని ఖఫీఖాన్ వివరిస్తాడు. ఔరంగజేబు జారీ చేసిన ఫర్మాన న్ను సారాంశంగా విశ్లేషిస్తే అబుల్హాసన్ మీద అతను చేసిన నేరారోపణలు: 1. నమ్మక ద్రోహియైన మాదన్నను రాజ్య దివాన్ గా నియమించడం. 2. ఇస్లాం మత విద్వేషకుడైన మాదన్న ద్వారా ముస్లిం ప్రజలనే గాక, పవిత్రులైన మత పెద్దలను కూడా హింసకు గురి చేశాడు. 3. మాదన్నకు అధికారం ఇచ్చి ఇస్లాం మత ఆచారాలను, నియమాలకు ప్రతిగా ఉదాసీనత