Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెంచాడు. మొషుల్ ప్రభుత్వం సాధారణంగా రాజకీయ, భౌతిక లబ్దికి ఆశపడటమే గాక, గోల్కొండను అవమానపరచడంలో, యుద్ధంలో గెలిచినంతగా గొప్ప విజేతగా సంబరపడి పోతుంది. ఈ సందర్భాన్ని ఉత్సవంగా జరుపుకుంటూ మీర్జా మహమ్మద్ నిమతాఖాన్ (Mirza mohd. Nimat Khan) ఒక చిన్న కవితను లిఖించాడు:

“ఎదురులేని, సదా దేశభక్తి చింతనా పరుడు, అజేయుడైన చక్రవర్తి
సామ్రాజ్య ప్రజలకు ఆనంద ప్రధాత
ఇదిగో! ఊహించని విధంగా నా మదికి భవిష్యద్దర్శనం ప్రాప్తించింది
హైదరాబాద్ పై విజయం యుద్ధానికి ముగింపు వాక్యం పలికింది”

షా ఆలమ్ హైదరాబాద్ లో కొన్ని మాసాలు మకాం వేసి ఒప్పందం ప్రకారం షరతులఅమలు సరిగా జరిగేట్లుగా పర్యవేక్షించాడు. నగర ముట్టడి, దోపిడీలు, జరిగిన అల్లర్లు సృష్టించిన అస్తవ్యస్త పరిస్థితులు కుతుబ్ షాహి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసి రోజు వారి పాలనా వ్యవహారాలను నడపడంలో షరతుల అమలులో అంతరాయం కలిగించసాగాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ధనరాశిని సమకూర్చుకోవడం, వార్షిక కప్పం చెల్లించడం చాలా కష్టమైంది. దీనికి అదనంగా మొఘల్ సేన రాజధానిలోనే తిష్ట వేయడంతో సమస్యలు మరింత క్లిష్టతర మయ్యాయి. అందుకే అబుల్ హసన్ మొఘల్ ప్రిన్స్తో వారి క్యాంపును నగరానికి దూరంగా మార్చుకొమ్మని మొరపెట్టుకోవడంతో అందుకు అంగీకరించిన ప్రిన్స్ హైరాబాద్ కు వాయవ్యంగా 70 మైళ్ళ దూరంలో వున్న కొహిర్ కు తన క్యాంపును మార్చాడు. దీనితో గోల్కొండ ప్రభుత్వానికి డబ్బు సమకూర్చుకుని కొంత బకాయి చెల్లించడానికి అవకాశం కల్పించిందనడంలో సందేహం లేదు. కాని అక్కన్న, మాదన్నలను పదవులనుండి తొలగించడం ఒక తప్పుడు నిర్ణయం. అది రాజుకు ఏ మాత్రం ఇష్టం లేదు. కాని రాజును బాధ పెట్టిన విషయమేమంటే హిందూ మంత్రులను గోల్కొండ ముస్లిం ప్రజలు, అంత:పుర స్త్రీలు కూడా మొఘలులతో సమానంగా అసహ్యించుకోవడం. రాజధాని నాశనానికి కేవలం వీరిద్దరే ప్రధాన కారకులని వీరంతా తప్పు బట్టారు. అక్కన్న, మాదన్న లను తొలగించడానికి ఊగిసలాడుతున్న సమయంలో ఆలస్యమవుతున్న కొద్దీ వారంటే ద్వేషం పెంచుకున్న వారిలో అసహనం పెరిగి, హింసాత్మక చర్యలకు పాల్పడసాగారు. రాజ ప్రముఖులు కొందరు, రాజ భవనంలోని సహనివాసులు, ప్రత్యేకించి కీర్తిశేషుడైన రాజు వితంతువులు సరూమ (Saruma), జానీ బేగమ్