Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, నగదు బలవంతంగా వసూలు చేశాడు. గోల్కొండ రాజ్యం నుండి ఏదో ఒక వంకతో చక్రవర్తి అపార సంపదను స్వంతం చేసుకోవడమే గాక తరచుగా గజబలాన్ని, బంగారాన్ని అమూల్య ఆభరణాలపై కన్ను వేసి పంపించమని లేదా కానుకలుగా కోరడమో, ఆదేశించడమో చేసేవాడు. రాజకీయ సమస్యలే గాక మొఘల్ ప్రభుత్వం ఆగ్రహానికి మరి రెండు కారణాలు: ఒకటి ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా పనిచేసే అక్కన్న, మాదన్నలకు అధికారం అంటగట్టడం; రెండవది తమ శత్రువైన శంభాజీతో స్నేహంగా మెదలడం. 1685 A.D. లో బీజాపూర్ పై దండెత్తినప్పుడు, ఏ రకమైన సహాయం అందజేయకూడదని అబుల్ హసన్ ను హెచ్చరించి, గోల్కొండపై నిఘా వుంచడానికి, బహ్రమదాన్ (Bahramad Khan)ను నియమించాడు. అయినప్పటికీ, అబులాసన్ తన పాత విధానాలను మార్చుకోలేదు. తమ అస్తిత్వం బీజాపూర్ స్నేహంతో ముడిపడియుందని గట్టిగా నమ్మేవాడు. ఫ్రైయర్ వ్యాఖ్యానించినట్లుగా గోల్కొండ నైతిక బలానికి బీజాపూర్ ఆధారమని అంటాడు. అందుకే గోల్కొండ నైతిక బలాన్ని దెబ్బ తీయాలంటే బీజాపూర్ పై దాడి చేయడమే. అబుల్హాసన్ ఏ మాత్రం ఆలస్యం చేయక ఆదిల్ షాహి రాజ్యానికి సహాయక రక్షణ దళాలను మురారి రావు నాయకత్వంలో పంపించాడు. సికందర్ ఆదిల్షా కూడా స్వయంగా చొరవతీసుకుని విపత్కరపరిస్థితిలో తక్షణ సహాయమందించ వలసిందిగా విన్నవించుకున్నాడు. కాని సరిహద్దులో మోహరించిన బహదూర్ ఖాన్, బహ్రామద్ ఖాన్, గోల్కొండ సేన బీజాపూర్ చేరకుండా నిలువరించగలిగారు. అబుల్ హాసన్ నిరాశ చెందకుండా గోల్కొండ ప్రముఖ జనరల్ ఐన ఖలీలుల్లా ఖాన్ ను పంపించాడు. కాని రెండవ దళం కూడా అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోలేకపోయింది. అంతేగాక హసన్ పంపిన రక్షణ సంబంధమైన రహస్య పత్రాలు మొఘల్ అధికారులుచేజిక్కించుకుని చక్రవర్తికి అందజేయడం జరుగుతుంది. రాజు తన గౌరవ, మర్యాద పూర్వక వ్యవహారాలను బుర్హాన్ పూర్ వద్ద చక్రవర్తికి అందజేయవలసిందిగా గోల్కొండ రాయబారులు మహమ్మద్ మసూం, మహమ్మద్ జాఫర్ లకు అప్పగించగా, చక్రవర్తి ఆదేశానుసారం పోలీస్ కమీషనర్ ఏతేమమ్ ఖాన్ (Ehtemam Khan) రాయబారులిద్దరిని, కష్టడీలోకి తీసుకుని ఉత్తరాలను సెన్సార్ చేస్తాడు. ఉత్తరాలలోని సారాంశం - "మేమందిస్తున్న గౌరవ మర్యాదలతో వారు (చక్రవర్తి) అత్యున్నత స్థానాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నారు. కాని ఇప్పుడు అనాథగా మిగిలిన సికందర్, బాలుడని కూడా చూడక అలుసు