Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బిరుదుతో సన్మానించబడినాడు.” ముస్లిం మతస్తుల పట్ల మాదన్న వైఖరి సందేహాలకు తావిచ్చేట్టుగా వుండేది. మాదన్న హయాంలో ముస్లిం కమ్యూనిటీల స్థితిగతుల పై సమకాలిక హిందు, ముస్లిం చరిత్రకారులు ఏకాభిప్రాయం ప్రకారం మాదన్న నిరంకుశ స్వభావం కలిగి ముస్లిం ప్రజల సముదాయాన్ని మత దృష్టితో చూసేవాడని తెలుస్తుంది. ముస్లిం ప్రజల సమస్యలను అలుసుగా తీసుకుని వారి విన్నపాలను సైతం నిర్లక్ష్యపరిచేవాడు. మహమ్మద్ సకీ మాటలను ఉటంకిస్తే “ఇస్లాం, ముస్లింలను తక్కువ దృష్టితో చూసేవాడు; మసీదులను నిర్లక్ష్య పరిచి మందిరాలపై శ్రద్ధ తీసుకునేవాడు”. ఔరంగజేబు దర్బారులోని చరిత్రకారుడు సకీ వ్యాఖ్యానాన్ని తోసిపుచ్చి, అతని మాటలు న్యాయసమ్మతం కాదని, పక్షపాత బుద్దితో వున్నాయని భావిస్తే అపుడు విదేశీయాత్రికుల రచనలు ప్రశ్నార్థకమవుతాయి. ఒకానొక సందర్భంలో మాదన్న దేవాలయాన్ని సందర్శించటానికి బయలు దేరినప్పుడు తనకు రక్షణగా వచ్చిన ముస్లిం సైనికులతో పలికిన మాటలు చరిత్రల లిఖించబడినాయి. ఇవే మాటలు దాదాపుగా అవే అర్థ విశేషణాలతో విదేశీ యాత్రికుల రచనల్లో కూడా దర్శన మిస్తాయి. మాదన్న ఒక దేవాలయంలో ఉత్సవ కార్యక్రమానికి బయలుదేరినప్పుడు అధికభాగం ముస్లింలతో వున్న సైనిక దళం అతనికి రక్షణగా వచ్చింది. అందులో చాలా వరకు సయ్యద్, షేక్ శాఖలకు చెందినవారు. ప్రయాణ సందర్భంలో వారిని ఉద్దేశిస్తూ మాదన్న గర్వంతో, వారి అహాన్ని తీసిపారేస్తున్నట్లు స్వరం పెంచి "మీ పూర్వీకులు హిందువులకు వ్యతిరేకంగా దారుణంగా ప్రవర్తించి పీడించినారు. హిందూ దేవాలయాలను గతంలో అపవిత్రం చేశారు. ఇప్పుడు దానికి ప్రతీకారంగా మీ అందరిని అధమస్థాయిలో వుంచుతున్నాను”. అని అన్నాడు మాదన్న. ఈ మాటలు విన్న సయ్యద్ల లు కంట తడి పెట్టారు. ఖఫిఖాన్ మరొక ఉదాహరణను ప్రస్తావిస్తాడు: "నిధులు దుర్వినియోగం ఆరోపణల మీద ఒక సయ్యద్ చేతులు మంత్రి ఆదేశంతో ముక్కలుగా నరికివేయబడతాయి”. మనూచి ఒక ఆసక్తికరమైన సంఘటనను వివరిస్తాడు. “ఒక ఇరానీ, నది ఒడ్డున బట్టలుతకడానికి వుంటాడు. అదే సమయంలో ఒక హిందువు వచ్చి అల్లరి పెట్టాలనే దురుద్దేశంతో అతనికి దగ్గరగా, పక్కన నిలబడి బట్టలు బండకేసి బాదుతూ, దుందుడుకుతనంతో వ్యవహరిస్తూ వుండగా ఆ బట్టలు చిలికిన నీళ్ళతో ఇరానీ తడిసిపోతాడు. అపుడు ఆ ఇరానీ హిందువుతో సౌమ్యంగా కాస్త పక్కకు జరిగి నీళ్ళు తనపైన పడకుండా నెమ్మదిగా వుతుక్కొమ్మని విన్నవించుకుంటాడు. అతని కోరికను మన్నించడానికి బదులుగా అసభ్యకరమైన పదజాలంతో ఇరానిపై చెయ్యి చేసుకుంటాడు. అందుకు ప్రతిగా ఇరాని కూడా ఒక చెంప దెబ్బ వేస్తాడు. ఫలితంగా చిన్న గొడవ జరుగుతుంది. అంతలో హిందువులు గుమికూడి ఇరానితో మోటుగా ప్రవర్తించి, సంకెళ్ళతో బంధించి మాదన్న ముందు హాజరు పరుస్తారు. మంత్రి ఆదేశంతో అతని చెయ్యిని నరికివేస్తారు. బాధితుడైన