కానీ బహదూర్ ఖాన్ సాధించిన యుద్ధ విజయాలు చక్రవర్తిని సంతృప్తి పరచలేకపోయాయి. పైపెచ్చు దిలారె ఖాన్ (Dilare khan) మిలట్రీ కమాండ్లో రెండవ స్థాయిలో వున్నవాడు. 1677 A.D. లో చక్రవర్తిపై దక్కన్ మీద పూర్తి స్థాయి అధికారాన్ని ఇవ్వమని ఒత్తిడి తెచ్చాడు. దక్కన్పై పూర్తిస్థాయి అధికారం దక్కగానే దిలారే ఖాన్, గుల్బర్గా నుండి మల్ ఖేడ్ (Malkhed) వరకు కుతుబ్ షాహి రాజ్యానికి పశ్చిమ సరిహద్దులకు తన సేనను వ్యాపింప చేశాడు. కేంద్రం నుండి అదనంగా సేన, సహకారం అందితే గోల్కొండను స్వాధీనపరుచుకుని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయగలనని కేంద్రానికి విన్నపం పంపాడు. విన్నపం అందుకున్న వెంటనే జవాబుగా చక్రవర్తి సేన అతనికి సహాయంగా బట్వాడా చేయబడింది. బీజాపూర్ బహ్లోల్ ఖాన్, (Fryer, చరిత్రకారుడు ఇతన్ని పఠాన్ యోధుడిగా అభివర్ణిస్తాడు), ఈ సందర్భంలో ఆక్రమణదారులకు బహిరంగంగానే మద్దతిస్తూ ముఖ్య కుట్రదారుడిగా వ్యవహరిస్తాడు. ఇట్టి విపత్కర పరిస్థితుల్లో గోల్కొండ ముంచుకొస్తున్న అపాయాలనుండి తనకు తాను రక్షించుకొనుటకు రక్షణ చర్యలను మరింతగా కట్టుదిట్టం చేసుకోవలసి వచ్చింది. గోల్కొండ కమాండర్ మహమ్మద్ ఇబ్రహీం, మలేఖేడ్ వెళ్ళి అక్కడ నగర రక్షణ చర్యలు, యుద్ధ సామాగ్రి, పనివాళ్ళు, ఉద్యోగులు సరిపడేంతగా వున్నారా? లేదా అని అంచనా వేశాడు. ఇబ్రహీం, మల్ ఖేడ్ పర్యవేక్షిస్తుండగా అక్కడ మొఘల్ సేన గుల్బర్గాను ఆక్రమించుకున్న వార్తలు వస్తాయి. అదే సమయంలో గోల్కొండ కమాండర్కు, మరాఠాలకు ఎలాంటి సహకారం అందించకూడదన్న హెచ్చరికగా మొఘల్ ఫర్మానా అందుతుంది. ఈ ఫర్మానాలను అనుసరిస్తూ వెంటనే చక్రవర్తి పంపిన సందేశం దిలారె ఖాన్ ద్వారా అబులసన్కు పంపబడుతుంది. హసన్, మొఘల్ తిరుగుబాటు దారుడైన షేక్ మన్హజ్ కు ఆశ్రయం ఇవ్వడం, శివాజీతో జతకూడి అతనికి సహకరించడం లాంటి నేరాలు చేసినందుకు నష్ట పరిహారం కింద కోటి రూపాయలు, పదివేలగుర్రాలు పంపించాలన్నది ఆ వర్తమాన సారాంశం. వాస్తవానికి షేక్ మసాజ్, ఆదిల్ షాహి సేవకుడు. అతను మొఘల్ శిబిరంలో చేరి, తిరిగి మొఘలులను వదిలి గోల్కొండకు చేరుకున్నాడు. ఈ మధ్య కాలంలో దిలారె ఖాన్ సేన, బహ్లో లాఖాన్ సేన కలిసికట్టుగా మల్ఫీడు చుట్టుముట్టారు. రక్తపాతాన్ని తప్పించుటకు అబులాసన్ ఐదు లక్షల రూపాయలను సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ దిలారే ఖాన్, బహ్లోలాన్ యుద్ధాన్నే నిశ్చయించుకుని హసన్ కానుకను తిరస్కరించి దాడి ప్రారంభిస్తారు. ఇరు పక్షాల మధ్య భీకరమైన యుద్ధం
పుట:గోల్కొండ చరిత్ర.pdf/228
స్వరూపం