Jump to content

పుట:గోల్కొండ చరిత్ర.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక ప్రత్యేక భాషాపరమైన, సాంస్కృతికపరమైన భాగంగా తనదైన విశిష్ట అస్తిత్వంతో, దక్కన్లోని మరో రెండు ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి ప్రత్యేకతను సంతరించుకుని ఉబికి వచ్చింది. తెలుగు భాషను, తెలుగు సంస్కృతికి ఒక ప్రత్యేక హోదానిచ్చి అనేక విశిష్టతలతో అభివృద్ధి పరిచి గుర్తింపులోకి తెచ్చిన వారిలో ముఖ్యులైన కాకతీయ పాలకులు - ప్రతాప రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి. వీరికి తెలుగువారు రుణపడి వుంటారు.

ఈ ప్రాచీన వ్యవస్థ ఒక శతాబ్ది కాలం కన్నా ఎక్కువ కొనసాగలేదు. పదునాల్గవ శతాబ్దం ప్రారంభంలో ఖిల్జీ (Khilji), తుగ్లక్ (Tughlak) లదాడులవల్ల పూర్తిగా పూర్వ వైభవం తుడుచుకు పెట్టుకుపోయింది. 1323 A.D. లో తుగ్లక్ ల దాడులవల్ల కాకతీయ సామ్రాజ్యం కూలదోయబడింది. తెలుగు రాజ్యంతో పాటు దక్కన్ లోని ఇతర ప్రాంతాలు కూడా తుగ్లక్ పాలనలోకి వచ్చాయి. దక్కన్ భూభాగంలోకి ఈ తుర్క్ ఆగమనంతో కొత్త శకం ప్రారంభమైంది. చరిత్రలో 'మధ్యయుగం' (Medieval Period) అనే కొత్త అధ్యాయానికి తెరతీసింది. దీనితో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా పాత సాంప్రదాయాలు, స్థిరీకరించబడిన వ్యవస్థలకు భంగం వాటిల్లలేదు. వాస్తవానికి ఉత్తరాది ప్రాంతాలనుండి దిగుమతైన అక్కడి సంస్కృతి సంప్రదాయాలతో సమ్మిళితమై దక్కన్ సంస్కృతి కొత్త సొబగులు అద్దుకుంది.కొత్తగా జయించిన ప్రాంతాలను, అనుభవజ్ఞులైన సుబేదారి ప్రముఖులకు పాలనాధికారులుగా నియమించగా వారు, ఉదారస్వభావం గలవారై హిందూ సామ్రాజ్యపు పాత సాంప్రదాయాలను గౌరవించడమే గాక, సాంప్రదాయిక విచారాలు, భావనలను, వ్యవస్థలను సంరక్షించారు. 1345 A.D. లో దక్కన్లోని ఈ సుబేదారులే వ్యక్తిగత స్వతంత్ర రాజులై తమ తమ ప్రాంతాలను స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పాటు చేసుకుని, పరిపాలించసాగారు. రెండు సంవత్సరాల తరువాత వీరే బహమనీ రాజులుగా పిలువబడినారు. అలా బహమనీ రాజ్యానికి బహమనిషా మొదటి రాజు కాగా, అతని పాలనలో ఆంధ్రులు అనుకూల వాతావరణం పొంది తమ సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ ముందుకు కొనసాగిస్తూ వచ్చారు. ఈ సమయంలో ఆంధ్రుల జాతీయత, సంస్కృతి గట్టి పడటానికి రెండు మూడు కారణాలను చూడవచ్చు. మొదటిగా దాదాపుగా వంద సంవత్సరాల వరకు సాగిన