నియంత్రణలోకి తీసుకుని, తన వారిని అప్రమత్తం చేసి అన్ని రకాల జాగరూకత చర్యలు తీసుకుని తనకు తానుగా సంతృప్తి చెందిన పిదప, తదుపరి చర్యకు ఉపక్రమించాడు. తదుపరి చర్యగా రాజభవనం ముట్టడి. సయ్యద్ అహ్మద్, అతని భార్య 'బడి సాహిబ్ని'లను అదుపులోకి తీసుకున్నాడు. ఆ సమయంలో అదే రాజభవనంలో మనోవేదనకు గురై అచేతనంగా పడివున్న రాజు, ఆర్మీ జనరల్ గా తనకున్న అనుభవంతో ముజఫ్ఫర్ సాయుధ దళాలను తాను ఎన్నుకున్న ప్రదేశాలలో నియమించి, దాడిచేసి ప్రత్యర్థులు ఎదురు దాడి చేయలేని నిస్సహాయ స్థితిని సృష్టించాడు. తదుపరి సయ్యద్ అహ్మద్ తో జతకూడిన వారందరని తనవైపుకు తిప్పుకున్నాడు. ఆ విధంగా శత్రువర్గం పన్నిన పథకాన్ని కొన్ని గంటల వ్యవధిలో వమ్ము చేసి పరిస్థితులను తన అదుపులో వుంచుకున్నాడు. 21 ఏప్రిల్, 1672 A.D. (1083 A.H.) లో రాజు అబ్దుల్లా మరణించిన వెంటనే అబుల్ హసన్ను గోల్కొండకు రాజుగా ప్రకటించాడు. సయ్యద్ అహ్మద్న నిర్బంధంలోకి తీసుకున్నాడు. ఏడాదిలోపే అహ్మద్ నిర్భందంలోనే మరణించాడు. అతని భార్యకు కూడా అదే గతి పట్టింది. సయ్యద్ సుల్తాన్ ఇది వరకే ఉత్తరాదికి పారిపోయి మొఘల్ సేవలో 'మన్సబ్' (Mansab}గా చేరిపోయాడు. గోల్కొండలోనే వున్న సయ్యద్ సుల్తాన్ కుమారుడు సయ్యద్ మాసూమ్ అలీ, అబుల్ హసన్ పట్టాభిషేకం అయిన వెంటనే గోల్కొండ వదిలి వెళ్ళాడు. తండ్రీ కొడుకులు గోల్కొండ వదిలి పారిపోయి మొఘల్ ప్రభుత్వంలో చేరిపోవడం గోల్కొండ రాజ్యం భవిష్యత్తుకు హానికారకమైనది.
పుట:గోల్కొండ చరిత్ర.pdf/217
స్వరూపం