భార్య కనుసన్నల్లో మెలిగేది. ప్యాలెన్ కార్యకలాపాలను ఒక మహారాణిగా తన ఆధీనంలో వుంచుకోవడమే గాక నీగ్రో, టర్కీ బానిస యువతులతో కూడిన మహిళా రక్షణ దళం నిర్వహించేది. వీరు ఆయుధధారులై ఎలాంటి పరిస్థితిలో నైనా ఎదుర్కోవడానికి సిద్దంగా వుంటారు. ప్యాలెస్ లొ బహిరంగంగా కత్తి చేతబట్టి అన్ని వైపులా తిరుగుతూ పర్యవేక్షించేది. రాజు అబ్దుల్లా మరణశయ్య మీద అచేతనంగా పడి వున్నప్పుడు రాజ్యంలో అంతర్యుద్ధం ఉత్పన్నమయ్యే అవకాశాలతో ఉద్రిక్తత ఏర్పడి భయానక స్థితి వుండగా, ప్యాలెస్ లొ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు అబుల్ హసన్ కేవలం సయ్యద్ ముజఫ్ఫర్, మూసాఖాన్ మీద ఆధారపడి మౌన ప్రేక్షకుడిలా వుండక ఒంటరి పోరాటం చేయడానికి సిద్దపడ్డాడు. ఒక రోజు అబుల్ హసన్ ప్యాలెస్ వైపు అశ్వారూఢుడై అక్కడి స్థితిగతులను అంచనా వేయడానికి బయలు దేరాడు. ఐతే ప్యాలెస్ పరిసరాల్లో హసన్ కనబడేసరికి సయ్యద్ అహ్మద్ వర్గం వారికి సందేహం కలిగి, హసన్ ప్రవర్తనను శంకించి, తిరుగుబాటు చేసి ప్యాలెస్ ను, రాజ్యాధికారాన్ని స్వాధీనపరుచుకునే ప్రయత్నంలో వున్నాడనుకుని వెంటనే అతనిపై దాడి చేస్తారు. హసన్ ఒంటరిగానే వారినెదుర్కొని అక్కడ్నుంచి పారిపోతాడు. విపత్తును సంభాళించుకుని తప్పించు కున్న అతనికి ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదు. ప్యాలెస్ ను వదిలి వెంటనే సయ్యద్ ముజఫ్ఫర్ నివాసానికి చేరుకుని నిస్సహాయంగా నేలమీద కుప్పకూలిపోతాడు. ఖఫీ ఖాన్ ప్రకారం హసన్ నేలమీద స్పృహ తప్పి పడిపోతాడు. ఖఫీ మాటల్లో అతిశయోక్తి వుండవచ్చుగాక, కాని హసన్ పరిస్థితులనెదుర్కోవడానికి సంఘర్షణకు లోనుకావడంతో సయ్యద్ ముజఫ్ఫర్ అతనికి ధైర్యం చెప్పి, అతనిలో ఉత్సాహాన్ని నింపి, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ‘చావో రేవో' అన్న రీతిలో పరిస్థితులనెదుర్కోవాలని సలహా ఇస్తాడు. అబుల్ హసన్, ఉద్యోగ రీత్యా తన ఎదుగుదలకు సయ్యద్ ముజఫ్ఫర్కు రుణపడి వుండాలి. ముజఫ్ఫర్ రాజతంత్రం ఎరిగిన వాడు, స్ఫురద్రూపి, పర్షియన్ మూలాలతో 'మజిందరాని' రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. సంస్కార వంతుడు. అపార మైన రాజకీయ అనుభవం కలిగి ముందుచూపు గలవాడు. 'సర్ ఖయిల్'గా (Sar Khail) జనరల్ హోదాలో వుండి ఒక సైనిక దళానికి నాయకత్వం వహించాడు. పరిస్థితులను ప్రశాంతంగా పరీక్షించి ఒక అవగాహనతో హూందాగా కార్యాన్ని నిర్వహించాడు. కొన్ని గంటల్లో తన ప్రత్యర్థిని అదుపులోకి తెచ్చుకోగలడని అంచనా వేసుకున్నాడు. అందుకే అబుల్ హసన్ ను వెంటబెట్టుకుని రాజధాని అంతటా పరిశీలించి శత్రువులు దాడి చేయడానికి అనువైన ప్రదేశాలను
పుట:గోల్కొండ చరిత్ర.pdf/216
స్వరూపం